Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో స్వయంగా హిమే నాకు క్యాన్సర్ అని అటు సౌందర్య, ఆనందరావులకి, ఇటు నిరుపమ్‌కి చెబుతుంది. అది విని అందరు కూడా ఒక్కసారిగా షాక్ కు గురి అవుతారు.మరోవైపు అదే విషయం ప్రేమ్, సత్యలకు కూడా తెలుస్తుంది. హిమ ఎక్కువరోజులు బతకదని తెలియడంతో నిరుపమ్ చాలా ఏడుస్తాడు. ఈ క్రమంలోనే నేటి కథనం మరింత ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.అదే బాధతో నిరూపమ్ ఆశ్రమానికి వెళ్లి హిమని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాల జాతకం చూసినా జ్యోతిష్యుడు ఏమి చెప్పాడు.?
ఇక సీన్ కట్ చేస్తే జాతకాలు చెప్పే సిద్దాంతి దింప మన్న చోట జూబ్లీహీల్స్‌లో దింపుతుంది సౌర్య. డబ్బులు తీసుకుని తిరిగి చిల్లర ఇస్తున్న సమయంలో జ్వాల చేయి చూసి ‘అమ్మా నీ జాతకం చూస్తుంటే నాకు మతి పోతుంది అమ్మా’ అంటాడు. ‘ఇదిగో సామీ.. నాకు ఇలాంటి వాటివై పెద్దగా నమ్మకాలు లేవు అంటుంది జ్వాల.ఇంతలో అక్కడకు శోభ వచ్చి జ్వాల చేతిని పట్టుకుని చివరికి జాతకాలు చెప్పించుకుంటున్నావా?’ అంటూ జ్వాల చేతి మీద ఉన్న హెచ్ అనే అక్షరాన్ని చూస్తుంది.సర్లే గాని ‘నీ జాతకాన్ని నేను చెప్పనా అంటూ భాగ్య రేఖ లేదు..లవ్ అండ్ లైఫ్ లైన్ కూడా నిల్ అంటూ వెటకారంగా చెబుతుంది.అది విన్న సిద్దాంతి ఏంటమ్మా మీరు అంతా రివర్స్‌లో చెబుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాల చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూసిన శోభ:
ఈ అమ్మాయి జాతకంలో అవన్నీ ఉన్నాయి అంటూ జ్వాల చేతిని తన చేతుల్లోకి తీసుకుని అమ్మా నీకు భాగ్య రేఖ చాలా పెద్దదమ్మా అని ఏవేవో చెప్పడంతో జ్వాల కోపంగా వెళ్లు ఇక్కడ నుంచి అని అరుస్తుంది. ఇక జాతకం చెప్పే జోగరావ్ నేను జాతకం చెబితే తిరుగు ఉండదమ్మా’ అంటూ శోభవైపు, జ్వాల వైపు చూస్తూ వెళ్లిపోతాడు.అదే క్రమంలో శోభ…జ్వాల చేతిని ముందుకు లాగి.. హెచ్ అంటే ఏంటీ? ఎవరి పేరు..? నీ లవర్ పేరా అంటూ ప్రశ్నలు వేస్తుంది. దాంతో జ్వాల ‘ఇది నా శత్రువు పేరు.. ఎక్కువ మాట్లాడితే నీ పేరు కూడా పచ్చబొట్టు వేయించుకుంటా అని కోపంగా ఇక్కడ నుండి వెళ్లు అంటుంది జ్వాల.
హిమ విషయం తెలిసి బాధలో కుటుంబసభ్యులు :
ఇక ఓ కాఫీ కేఫ్‌లో జ్వాల, నిరుపమ్‌లు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు.అయితే నిరుపమ్ డల్‌గా ఉండటంతో అది చూసిన జ్వాల ‘మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా డాక్టర్ సాబ్ అంటుంది.ఇక హిమ తనకు క్యాన్సర్ అనే విషయాన్నీ జ్వాలకు చెప్పొద్దు అన్నమాటలు గుర్తు రావడంతో మౌనంగా ఉండిపోతాడు.సీన్ కట్ చేస్తే.. హిమ సోఫాలో కూర్చుని ఉంటుంది. కాస్త దూరంలో సౌందర్య, ఆనందరావులు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ భర్త ఆనందరావుతో.. ‘హిమ ఇన్ని రోజులు నిజం చెప్పట్లేదనే కోపంతో ఉన్నాం.. కానీ నిజం ఇది అని తెలిశాక ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాం’ అంటూ తెగ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనందరావు హిమ పరిస్థితి తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు.ఇక సౌందర్య జ్యూస్ తీసుకుని హిమ దగ్గరకు వెళ్తుంటే అంతలో సత్య, స్వప్న కలిసి ఇంటికి వస్తారు.మమ్మల్ని ‘నిరుపమ్ ఇక్కడికి రమ్మని చెప్పారు అత్తయ్యా’ అంటాడు సత్య. ఇక సౌందర్య హిమ దగ్గరకు వెళ్లి జ్యూస్ అందివ్వబోతుంటే నిరూపమ్ వచ్చి ఆ జ్యూస్ తీసుకుని తనే హిమకు ఇస్తాడు. హిమ కూడా తాగుతుంది.
హిమను పెళ్లి చేసుకుంటా అని తేల్చి చెప్పిన నిరూపమ్ :
ఇంతలో నిరూపమ్ మీ అందరికి ఒక విషయం చెప్పాలని అంటాడు.ఈ రోజు నుంచి హిమకు అన్ని సేవలు నేనే చేస్తాను అది కూడా ఒక డాక్టర్‌లాగా కాదు.. అలా అని ఒక బావగా కూడా కాదు.. భర్తగా హిమకు అన్ని సేవలు చేస్తాను అంటాడు.రేయ్ ఏం అంటున్నావ్రా?’ అంటుంది స్వప్న కోపంగా. ‘మమ్మీ నేను చెప్పింది వినడానికి మాత్రమే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను..’ అంటాడు నిరుపమ్.‘ఇక నుంచి హిమ కష్టం నా కష్టం. హిమ బాధ నా బాధ. ఇక నుంచి తను నేను వేరు వేరు కాదు.ఒక పసిపాపలా తనని నేను చూసుకుంటాను అంటాడు.ఆ మాటలకు అంతా షాక్ అవుతారు. ‘నిరుపమ్..’ అని అరుస్తుంది స్వప్న.అయినాగాని నిరూపమ్ వినకుండా హిమని పెళ్లి చేసుకుని తీరతాను ఇది ఫైనల్’ అంటాడు నిరుపమ్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!