Ram Charantej: చిరంజీవి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ తనదైన శైలిలో ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఏ హీరోకి లేని రీతిలో రామ్ చరణ్ కి మూడు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మగధీర, రంగస్థలం లేటెస్ట్ గా “RRR” సినిమాలతో చరణ్ ఇండస్ట్రీ హిట్ లు అందుకోవటం తెలిసిందే. ఇదిలాఉంటే ఇటీవల ఓ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు.. చరణ్ నటనపై నెగిటివ్ కామెంట్ చేయటం తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చరణ్ నటనలో అంత దమ్ము ఉండగానే తన దృష్టిలో ఎన్టీఆర్ మంచి నటుడు ఆ తర్వాత బన్నీ కూడా బాగా చేస్తాడు అంటూ కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఇదే కామెంట్లపై సోషల్ మీడియా ఇంటర్వ్యూలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నీ యాంకర్ ప్రశ్నించారు. సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు కచ్చితంగా ప్రతి సినిమా చూస్తాను అని రఘురామ కృష్ణంరాజు తెలియజేస్తూ చరణ్ పై కోట శ్రీనివాసరావు చేసిన విమర్శల ప్రస్తావన గురించి మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు గారు… చాలా విలక్షణమైన నటుడు.
ఆయన ఏ ఉద్దేశం తోనే ఉంటారు మనకి తెలియదు. ఇదంతా పక్కన పెడితే చరణ్ మంచి నటుడు. ఇప్పుడు మాత్రమే కాదు చిన్ననాటి నుండి ఇచ్చారండి నాకు బాగా తెలుసు. అతని నటన గురించి చెప్పాలంటే “మగధీర”లో రాణి పడిపోతున్న సందర్భంలో చరన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలు అతని నటన గురించి చెప్పడానికి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతమాత్రమే కాదు రామ్ చరణ్ చాలా హార్డ్ వర్కర్.. నిర్మాతలను గౌరవించే హీరో అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలియజేశారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!