Naga Chaitanya: గత ఏడాది అక్టోబర్ 2వ తారీఖు నాడు సమంత-నాగ చైతన్య ఇద్దరు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాలు కలసి ఉన్న తర్వాత ఏ కారణంగా విడిపోయారు అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే విడిపోయాక సమంత కెరీర్ పరంగా బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ లో మరియు వెబ్ సిరీస్ లలో సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా గడుపుతోంది. ఇక నాగచైతన్య కూడా కొత్త ప్రాజెక్టు ఓకే చేసే పనిలో ఉన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదంతా పక్కన పెడితే నాగచైతన్య… సమంతతో విడిపోయిన ఎన్ని నెలలకు ఇప్పుడు మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళితే వచ్చిన వార్త ప్రకారం.. “మేజర్” మూవీ లో కీలక పాత్ర చేసిన శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య కొత్త ఇంటిలో చాలా గంటలు శోభిత దూళిపాళ్ల గడుపుతున్నట్లు టాక్. ఇటీవల మేజర్ ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో కూడా ఎక్కువగా నాగచైతన్య ఇంట్లోనే గడపడంతో పాటు ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్త. అంతమాత్రమే కాదు మే నెలలో శోభిత దూళిపాళ్ల జన్మదిన వేడుకలు కూడా హైదరాబాద్ లోనే జరుపుకొందట.
ముంబై నుండి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాగ చైతన్య తన ఇంటిని ఆమెకు గడపటానికి కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఇద్దరు కూడా చాలా క్లోజ్..గా ఉంటున్నట్లు చాలా హోటల్స్ లో కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సమంతాతో విడిపోయిన ఎనిమిది నెలలకే శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య క్లోజ్ గా ఉంటున్నట్లు వార్త రావడం ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా మారింది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?