NewsOrbit
Entertainment News సినిమా

Hero Ram: త‌గ్గేదే లే అంటున్న రామ్‌.. ప‌వ‌ర్ స్టార్‌ డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్‌!?

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిక్ స్టార్ రామ్ పోతినేని..డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడీయ‌న‌. అలాగే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను చెరిపేసి.. మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మూవీ అనంత‌రం మాస్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్న రామ్‌.. త్వ‌ర‌లోనే `ది వారియ‌ర్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్.లింగుస్వామి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వ‌చ్చే నెల 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ అనంత‌రం రామ్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. రామ్ కి ఇది 20వ చిత్ర‌మైతే.. బోయ‌పాటి శ్రీ‌నుకి 10వ చిత్రం. అయితే ఈ మూవీ ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌క‌ముందే రామ్ త‌గ్గేదే లే అంటూ మ‌రో డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌.

ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. హరీశ్ శంకర్. రీసెంట్‌గా హ‌రీశ్ శంక‌ర్ ఓ అదిరిపోయే క‌థ‌ను రెడీ చేసి.. రామ్ కు వినిపించాడ‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో.. వెంట‌నే సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ని అంటున్నారు. కాగా, హ‌రీశ్ శంక‌ర్ ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `భవదీయుడు భగత్ సింగ్` సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ త‌ర్వాత రామ్‌-హ‌రీశ్ శంక‌ర్ మూవీ ఉంటుంద‌ని టాక్ న‌డుస్తోంది.

 

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N