NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. దుబ్బాక (Dubbaka) ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 40కిపైగా స్థానాలు కైవశం చేసుకోవడం, ఆ తరువాత హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికల్లో గెలవడంతో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం ఖాయమంటూ ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు తరచు కార్యక్రమాలకు వస్తూ కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ వేదికగా జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ఇలా పార్టీ అగ్రనేతలు అందరూ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హజరు అవుతున్నారు.

BJP Got Big Shock GHMC Corporators joins TRS
BJP Got Big Shock GHMC Corporators joins TRS

 

ఈ తరుణంలో జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక్క రోజు ముందు ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్ లతో పాటు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ లు బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. హస్తినాపురం కార్పోరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పోరేటర్ పొడుపు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పోరేటర్ దేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పోరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపి ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ అసిఫ్ లు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ సమంక్షంలో వీరు పార్టీలో చేరి గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇటీవలే జీహెచ్ఎంసీ కార్పోరేటర్ లతో ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న తరుణంలో నలుగురు కార్పోరేట్ లు పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరడం విశేషం.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju