NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

26వ తేదీ నుండి వరద ప్రాంతాల్లో సీఎం జగన్ క్షేత్ర పరిశీలన.. ప్రకటించిన వైసీపీ

ఏపిలోని ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి పరివాహన ప్రాంతాలు ఇటీవల వరదలో మునిగిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం పరిహారం, నిత్యావసరాలు పంపిణీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీపీఐ నేత నారాయణ పర్యటించి బాధితులను పరామర్శించారు. అటు తెలంగాణలో భద్రాచలం ప్రాంతంలో సీఎం కేసిఆర్. గవర్నర్ తమిళిసై వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు గానీ నేరుగా ఆయా ప్రాంతాల్లో ఇంత వరకూ పర్యటించలేదు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 50కి పైగా గ్రామాలు వరద ముంపునకు గురైయ్యాయి, వేలాది ఎకరాల పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టడం, ఎప్పటికప్పుడు సీఎం ఆయా జిల్లాల అధికారులతో సమీక్షలు జరపడం తదితర చర్యలతో ప్రాణనష్టం జరగలేదు. కేవలం ఆస్తినష్టం సంభవించింది.

 

ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేరుగా క్షేత్ర పరిశీలన చేయకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో వైసీపీ దిద్దిబాటు చర్యలకు సిద్దమైంది. గోదావరి వరద క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ నెల 26న వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడనున్నట్లు వైసీపీ ప్రకటించింది. రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగుతుందని వైసీపీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆ మరునాడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంతో పాటు వరద బాధితులతో మాట్లాడేందుకు జగన్ ఈ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో మంత్రులు, ఆయా ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంతకు ముందే పర్యటించారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju