NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

విమానంలో ప్రయాణీకుడికి అత్యవసర వైద్యసేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్వతహాగా వైద్యురాలు. ఆమె రాజకీయాల్లోకి రాకముందు మద్రాస్ లో ఎంబీబీఎస్ పూర్తి అయిన తరువాత కెనడాలో ప్రత్యేక కోర్సు పూర్తి చేశారు. చెన్నై రామచంద్ర మెడికల్ కళాశాలలో అయిదేళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై అకస్మాత్తుగా బీపీ ఆపరేటర్, స్టేటస్ కోప్ పట్టుకుని వైద్యురాలి అవతారం ఎత్తారు. ఓ వ్యక్తికి ప్రాధమ చికిత్స అందించి మావత్వాన్ని చాటుకున్నారు.

 

విషయంలోకి వెళితే.. వారణాసి పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళి సై శుక్రవారం రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో తిరుగు ప్రయాణం అయ్యారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికి ఓ వ్యక్తి ఛాతి నొప్పితో అస్వస్థతకు గురి కావడంతో విమాన సిబ్బంది.. ప్రయాణీకుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా అంటూ.. ఓ వ్యక్తికి అత్యవసర వైద్యసేవలు అందించాల్సి ఉంది అంటూ అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో వెంటనే తమిళిసై స్పందించి.. అస్వస్థతకు గురైన ప్రయాణీకుడి వద్దకు వెళ్లి ప్రాధమిక చికిత్స అందించి ఉప శమనం కల్గించారు. దీంతో ప్రాధమిక చికిత్స తో కోలుకున్న వ్యక్తితో పాటు ఇతర ప్రయాణీకులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

ఓ వ్యక్తి అస్వస్థతకు గురైన వెంటనే కంగారుపడకుండా స్పందించి వైద్యసేవలు అందించేందుకు అనౌన్స్ మెంట్ చేసిన విమాన సిబ్బందికి తమిళి సై అభినందిస్తూ కీలక సూచనలు చేశారు. విమానంలో ప్రాధమిక చికత్సకు సంబంధించి కిట్ ను తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, విమాన ప్రయాణీకుల్లో వైద్యులు ఎవరైనా ఉంటే ముందుగానే వారి వివరాలు తీసుకోవాలనీ, అంతే కాకుండా విమాన సిబ్బందికి సీపీఆర్ పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. సిబ్బందితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్ చేసే విధానంపై శిక్షణ తీసుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్ తమిళి సై.

గవర్నర్ గా తమ బాధ్యతలతో పాటు ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలను తమిళిసై నిర్వహిస్తున్నారు. ఇప్పుడు విమానంలో తోటి ప్రయాణీకుడికి వైద్యసేవలు అందించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ లు తమిళి సైకి అభినందనలు తెలియజేస్తున్నారు.

న్యూ ఢిల్లీ లో మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు రైల్వే సిబ్బంది అరెస్టు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N