NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు ఢిల్లీలో షాక్ .. కేశినేని వైఖరితో అవాక్కు

చంద్రబాబు వైఖరిపై విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అసంతృప్తిగా ఉన్నారా.. ? ఇంతకు ముందు మాదిరిగా చంద్రబాబుతో సఖ్యతగా ఉండలేకపోతున్నారా.. ? అంటే అవుననే సమాధానం వస్తుంది. కేశినేని కుటుంబ వివాదాల్లో రాజకీయం చోటుచేసుకోవడంతో ఆ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. కేశినేని నానికి ఆయన సోదరుడు చిన్నికి మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు కుటుంబాలకు మాటలు లేవు. అయితే చిన్ని విజయవాడ టీడీపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇది కేశినేని నానికి ఇష్టం లేదు. పలువురు పార్టీ నాయకులు కూడా కేశినేని సోదరుడుతో సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ నాయకత్వం కూడా చిన్నిని ప్రోత్సహిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇంతకు ముందు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ..ఢిల్లీకి వెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని ప్రవర్తన అవాక్కు అయ్యేలా చేసింది. అక్కడ పరిమాణం చూసిన వాళ్లు చంద్రబాబు పట్ల కేశినేని నాని అసంతృప్తిగా ఉన్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

 

విషయంలోకి వెళితే .. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏపి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీగా అమృత్ మహోత్సవ్ లో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లగా, టీడీపీ ఎంపీలు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు లతో పాటు కేశినేని నాని చంద్రబాబుకు స్వాగతం పలికారు. ముందుగా చంద్రబాబును దుశ్సాలువా కప్పి సత్కరించి ఆహ్వానం పలికారు. తరువాత చంద్రబాబుకు అందజేసేందుకు గాను కేశినేని నానికి గల్లా జయదేవ్ బొకే ఇచ్చే ప్రయత్నం చేయగా తిరస్కరించి మీరే ఇవ్వాలంటూ వారించారు. అన్నా తీసుకుని ఇవ్వు అన్నట్లుగా మరో సారి గల్లా జయదేవ్ ప్రయత్నించగా గట్టిగా ఆయన చేయిని అవతలకు తోసేశారు కేశినేని నాని. ఈ పరిణామంతో చంద్రబాబు అవాక్కయాడని అంటున్నారు. చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి, ఆయన పక్కన నిలబడటానికి కూడా కేశినేని ఇష్టపడకుండా ముభావంగా ఉన్నాడని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

కాగా చంద్రబాబు ఆ తరువాత గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. తదుపరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డిఏ అభ్యర్ధికి టీడీపీ మద్దతు ప్రకటించింది.

21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఆ నలుగురు ప్రముఖులు

Related posts

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!