NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు

ఏపిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు పాడ్యమి సోమవారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. స్వర్ణ కవచంతో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కల్గిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కల్గిన మోముతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సింహ వాహనాన్ని అధిష్టించిన దుర్గమ్మ శంకు చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉన్నారు.తొలి రోజు అమ్మవారికి స్నపనాభేషకం చేశారు.

Kanakadurgamma     

 

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించకుని తొలి పూజ చేశారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తుల ధర్శనానికి అవకాశం కల్పించారు. ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వేకువజాము 3 గంటల నుండే క్యూలైన్ లలో బారులు తీరారు. ఆలయం ఘాట్ రోడ్డు కింద ఉన్న ఆలయం వద్ద ఆలయ అర్చకులు దీక్షాధారులకు భవానీ మాలలు వేస్తున్నారు. జై దుర్గ, జైజై దుర్గ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఉత్సవాల్లో రెండవ రోజు రేపటి నుండి ఉదయం 4 గంటల మొదలు రాత్రి 11 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. రోజు సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకూ అమ్మవారికి మహనివేదన , పంచహరతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి. ఈ సమయంలో దర్శనాలను నిలిపివేస్తారు.

ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం నుండి నగరోత్సవం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 5 విజయదశమి రోజున మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే నగరోత్సవం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో దసరా పది రోజులు ప్రత్యేక పూజలు ఉంటాయి.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కట్టు సత్యనారాయణ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఇఓ భ్రమరాంబ, పది శాఖల అధికారులు ప్రత్యక్షంగా ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క కృష్ణానదిలో వరద ఉదృతిని దృష్టిలో ఉంచుకుని నదీ స్నానాలను పూర్తిగా నిషేదించారు అధికారులు. ఘాట్ ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N