NewsOrbit
Telugu TV Serials

Karthikadeepam: దీప నా భార్య అంటూ మోనిత చెంప పగలకొట్టిన కార్తీక్..!

Karthikadeepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1473 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 04 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..కార్తీకదీపం సీరియల్‌లో.. ప్లాష్ బ్యాక్ స్టోరీ కొనసాగుతుంది.సీరియల్లో దుర్గ ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆసక్తిగా ముందుకు సాగుతుంది. గత ఎపిసోడ్ లో దుర్గ, మోనితల మీద కార్తీక్ కు అనుమానం వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే దుర్గ వచ్చినప్పటి నుంచి దీపకు దైర్యం పెరిగింది. మరోపక్క మోనితకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మోనిత…కార్తీక్‌కి ఏదీ గుర్తు ఉండదు కదా.. ఇది కూడా మరిచిపోయి ఉంటాడా? లేక గుర్తు పెట్టుకున్నాడా? అని ఆలోచనలో పడుతుంది మోనిత..నాకు దుర్గకు ఏ సంబంధం లేదని కార్తీక్‌కి చెప్పెయ్యాలి’ అనుకుంటూ ఫిక్స్ అవుతుంది.

నన్ను తప్పుగా అనుకోవద్దు కార్తీక్ అంటున్న మోనిత :

Karthik, monitha

బాబు దగ్గర ఉన్న కార్తీక్ ను చూసి కార్తీక్ నీతో మాట్లాడాలి అని పిలిచి దుర్గ విషయంలో నా తప్పేమి లేదు కార్తీక్’ అంటూ తన నాటకం స్టార్ట్ చేస్తుంది మోనిత. ‘గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్ మోనితా’ అంటాడు కార్తీక్ సూటిగా. వీళ్ల మాటలను దీప చాటుగా వింటోంది. నువ్వు నా గురించి తప్పుగా అనుకోవాలని ఆ దుర్గ ఆడుతున్న నాటకం ఇది అంటూ మోనిత ఏడుస్తుంది. అసలు నీ గురించి తప్పుగా అనుకుంటే అతడికి వచ్చే లాభమేంటీ? అసలు అతను ఎవరు? నీకు అతడికి ఉన్న సంబంధం ఏంటీ?’ అంటాడు కార్తీక్ కోపంగా. మోనిత బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది.వీళ్ళ మాటలను విన్న దీప బాగా అడిగారు డాక్టర్ బాబు అని అనుకుంటుంది మనసులో.

నీ కడుపులో పెరిగే బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్న కార్తీక్ :

Karthik, monitha

వాడికి నాకు ఏ సంబంధం లేదు కార్తీక్.. అంతా వివరంగా తర్వాత చెబుతాను ఇప్పుడు నేనేమి చెప్పలేను.నేను ఏ తప్పు చెయ్యలేదు నన్ను నమ్ము కార్తీక్ నా గురించి తప్పుగా అనుకోవద్దు అంటూ మోనిత దొంగ ఏడుపుతో డోస్ పెంచుతుంది. మోనిత మాటలను విన్న కార్తీక్ కు గతంలో దీపని అనుమానించిన సంఘటన గుర్తొస్తుంది. ‘దీని కడుపులో పెరిగే బిడ్డకు నేను తండ్రిని కాదు అని తను అరిచిన మాటలు గుర్తొచ్చి అరుస్తూ ఆవేశంగా పైకి లేస్తాడు. కార్తీక్ రియాక్షన్ చూసి దీప, మోనిత ఇద్దరూ షాక్ అవుతారు.డాక్టర్ బాబు గతం గుర్తుకు తెచ్చుకోవడానికి బలవంతంగా ట్రై చేస్తున్నారట్టున్నారు.అది మంచిది కాదు అని డాక్టర్లు చెప్పారు కదా అనుకుంటూ దీప అక్కడే ఉన్న బట్టల స్టాండ్‌ని కింద పడేసి కనపడకుండా పక్కకు తప్పుకుంటుంది. ఆ శబ్దానికి కార్తీక్ మళ్ళీ మాములుగా అయిపోతాడు. హమ్మయ్య అని మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. ‘కార్తీక్ తల పట్టుకుని ఉంటే కార్తీక్ ఏం అయ్యింది అంటుంది మోనిత కంగారుగా నువ్వు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకో వెళ్లు’ అంటూ గదిలోకి పంపిస్తుంది.

మోనిత తిక్క కుదర్చడానికి దీప, దుర్గ మరొక ప్లాన్:

Karthik, durga

ఇక ఇంటికి వెళ్లిన దీప జరిగిన విషయం అంతా దుర్గకు చెబుతుంది.‘డాక్టర్ బాబు గతం గుర్తు చేసుకుంటుంటే ఎందుకు డిస్ట్రబ్ చేశావ్ దీపమ్మా. గతం గుర్తుకు వస్తే మంచిదే కదమ్మా అంటే…అది కాదు దుర్గా ఆయన బలవంతంగా గతం గుర్తు తెచ్చుకుంటే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారుగా అంటుంది. అందుకే రిస్క్ చేయలేకపోయాను అంటుంది. ముందు మనం అనుకున్నదే చేద్దాం. దానంతట అదే డాక్టర్ బాబుకి నేను నీ భార్యని కాదు అని చెప్పాలి అంటుంది దీప. ఇప్పుడు డాక్టర్ బాబుకి అనుమానం క్రియేట్ చేసి వదిలేస్తాం. ఆ తర్వాత నాకు దానికి ఏ సంబంధం లేదని డాక్టర్ బాబుకి నిరూపించాలంటే అది గతంలోకి వెళ్లాలి. అప్పుడు కచ్చితంగా అది డాక్టర్ బాబు భార్య కాదు అని చెప్పుకోవాల్సిందే కదా అంటాడు దుర్గ. ‘అవును అన్నట్లు దీప తలాడించి మరొక ఐడియా చెబుతుంది. అంతా విన్న దుర్గ.. ‘దీపమ్మా అదిరిపోయింది అంటాడు దుర్గ.

మోనిత చెంప పగలకొట్టి దీప నా భార్య అన్న కార్తీక్ :

Karthik, deepa, monitha


సీన్ కట్ చేస్తే మోనిత కూర్చుని జరిగిన విషయాలు గుర్తుకుతెచ్చుకుంటూ ఉంటే కార్తీక్ వచ్చి తన రెండు దవడలు వాయించి, దీప చేయి పట్టుకుని నా భార్యని నాకు దూరం చేస్తావా అని ఫైర్ అవుతూ ఉంటాడు. అంతటితో ఆగకుండా ఈమె వంటలక్క కాదు.. దీప.. నా భార్య అని చెబుతూ దీప భుజం మీద చేయి వేసి చెబుతాడు. అయితే ఇదంతా మోనిత కల కంటుంది అన్నమాట కలలో నుంచి బయటకు వచ్చిన మోనిత గట్టిగా అరుస్తూ ఉంటే కార్తీక్ వచ్చి ఏంటి మోనిత అంటే ఏమిలేదు అంటుంది.

కార్తీక్ దగ్గర మోనితను ఇరికించిన దుర్గ :

Karthik, deepa, monitha


తరువాత కార్తీక్ సోఫాలో కూర్చుని ఉంటే మోనిత పకోడీ తెచ్చి కార్తీక్ కు ఇచ్చి వర్షంలో మనం ఇద్దరం. కలిసి ఇలానే పకోడీ తినేవాళ్ళం కార్తీక్ అంటే నాకు అవేమి గుర్తుకు రావడం లేదు అంటాడు. అప్పుడే దుర్గ వచ్చి పకోడి తినేస్తున్నారా. కాస్త లేట్ అయేటప్పటికి డాక్టర్ బాబుకు పెట్టేస్తున్నావా అంటాడు. నాకు ఫోన్ చేసి రమ్మన్నావ్ గా అని దుర్గ అంటే నేను ఎక్కడ ఫోన్ చేశాను రా అని చెప్పి అంటుంది. దుర్గ ఫోన్ తీసి మౌనిక నెంబర్ ని చూపిస్తాడు కార్తీక్ ఒకసారిగా షాక్ అవుతాడు కార్తీక్ తో పాటు మౌనిక కూడా బిత్తర పోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప చక్కగా రెడీ అయి డాక్టర్ అన్నయ్యను, వాళ్ళ అమ్మని, తీసుకుని వచ్చి డాక్టర్ బాబు ఈరోజు మీ పుట్టినరోజు అనడంతో కార్తీక్, మోనిత ఇద్దరు ఆశ్చర్యంలో అలానే ఉండిపోతారు.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.!

    




Related posts

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu