NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha manasu : జగతికి అమ్మ స్థానం ఇవ్వకపోయినా అత్త స్థానం ఇచ్చిన రిషి… అది కూడా దక్కనివ్వకుండా వసు చేస్తుందా..??

Guppedantha Manasu October 14th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 581వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 14న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఈ రోజు ఎపిసోడ్ లో దేవయాని ఇంట్లో బొమ్మల కొలువు సందడి నడుస్తోంది. బొమ్మలకు ఏ చీర సెలెక్ట్ చేయాలా అని వసు ఆలోచిస్తుంటే ఇప్పుడే వస్తాను అన్ని రిషి అక్కడ నుండి వెళతాడు. దేవయాని వీళ్లు వెళ్లి చాలాసేపైంది ఇంకా రాలేదేంటని పైన చూస్తూ ఉంటుంది.ఇంతలో గౌతమ్ వచ్చి అదే మాట అడుగుతాడు..నాకేం తెలుసు అని దేవయాని అనడంతో నేను వెళ్లి పిలుచుకుని రానా అని అడుగుతాడు..వెంటనే జగతి సైగ చేసి గౌతమ్ ని వెనక్కు రప్పిస్తుంది..

రాజు, రాణిలతో వసు, రిషిల సెల్ఫీలు :

Rishi, vasu

రిషి మాత్రం వసూ గిఫ్ట్ గా ఇచ్చిన రాజా రాణి బొమ్మలు తీసుకొస్తాడు. వాటితో కలిసి రిషితో సెల్ఫీ తీసుకుంటుంది వసూ.ఈ బొమ్మలు ఎప్పటికీ వీడిపోకూడదని వసు అంటే ఈ బొమ్మల మాదిరే మన బంధం ఎప్పటికీ విడిపోకూడదని మనసులో అనుకుంటాడు. వీళ్లింకా రాలేదేంటని మహేంద్ర అంటే ఇక్కడ ఉండి అనుకుంటే ఏం లాభం వెళ్లి పిలుచుకునిరా అని కోప్పడుతుంది దేవయాని. ఇంతలో ఇద్దరూ కిందకు రానే వస్తారు. రిషి ఆ బొమ్మలు కూడా అక్కడ పెడదాం అంటాడు. ఈ బొమ్మలు బలే ఉన్నాయి ఇలా ఇవ్వు అని గౌతమ్ అంటే..నేను ఇవ్వను అంటాడు రిషి. ఆ బొమ్మలేంటని దేవయాని అడిగితే.. నేనే తయారు చేసి ఇచ్చానంటుంది వసుధార.ఆ బొమ్మలతో పాటూ ఇద్దరికీ ఫొటో తీస్తాడు గౌతమ్. అలాగే అందరు ఫోటోలు దిగుతారు.

దేవుడిన మనసులో కోర్కెలు కోరుకున్న కుటుంబసభ్యులు :

Jagathi happiness

రాజా-రాణి బొమ్మల్ని కొలువులో పెట్టిన రిషి… ఈ బొమ్మలు మన ప్రేమకు ప్రతిరూపాలు వసుధార అని అనుకుంటే.. ఈ బొమ్మల మధ్య, మనమధ్య దూరం ఎప్పుడూ ఉండొద్దు సార్ అనుకుంటుంది వసుధార. ఇక ఎవరికి వారు మనసులో కోరికలు కోరుకుంటారు. వసుధార రిషిలు ఎప్పటికీ కలసి ఉండాలి ఆనందంగా ఉండాలని జగతి, మహేంద్ర అనుకుంటారు. ఇక
ఈ ఇంట్లో నా పెత్తనం సాగాలి, రిషి నన్ను గౌరవిస్తూ నా మాట వినాలి అని దేవయాని అనుకుంటుంది. మా పెద్ద అత్తయ్యా ఏది అనుకుంటే అది జరగకూడదు అని ధరణి అనుకుంటుంది.ఇక గౌతమ్ మాత్రం ఈ రిషి గాడి కోపాన్ని తగ్గించు స్వామి అని బయటకు అనేస్తాడు.ఇక రిషి మాత్రం వసుధార మనసులో ఉన్న అడ్డుతెర తొలగాలి తను గొప్ప స్థాయికి వెళ్లాలి అనుకుంటాడు. అలాగే వసూ రిషి సార్ మా జగతి మేడంని అమ్మా అని పిలవాలి.మచ్చలేని చంద్రుడిలా చూడాలి..ఎప్పుడూ ప్రిన్స్ లానే ఉండాలి అనుకుంటుంది..

జగతికి అత్తగారి స్థానం ఇచ్చిన రిషి :

Guppedantha manasu serial review


ఇక గౌతమ్ ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు పెద్దమ్మా అని అడుగుతాడు..దేవయాని నసుగుతుంటే.. నేను చెబుతాను సార్ అంటూ వసు బొమ్మల కొలువు ప్రాముఖ్యత చెబుతుంది.చిన్నపాటి క్లాస్ నడుస్తోంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..మేడం ఇది మా నానమ్మగారి చీర..ఈ ఇంటికొచ్చే కోడలిగా వసుధార ఈ చీర కట్టుకుంటే బావుంటుంది అంటాడు. రిషి ఆ మాట అనగానే అందరి మొహాల్లో ఆనందం ఉప్పొంగుతుంది.దేవయానికి మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.ఈ చీర మీ చేతులమీదుగా వసుధారకి ఇవ్వండి అంటాడు రిషి.ఇక జగతి సంతోషిస్తూ రాబోయే కోడలికి కాబోయే అత్తగారిలా నాకు అధికారం ఇస్తున్నావా రిషి అనుకుంటుంది మనసులో.

లోపల ద్వేషం బయటకు పెద్దరికం ప్రదర్శిస్తున్న దేవయాని :

Vasu confusion

ఇక దేవయాని అసలే అది మా అత్తగారి చీర..పవిత్రంగా,గౌరవంగా చూసుకోవాలి కదా..ఉట్టి చీర ఇవ్వకు పసుపు, కుంకుమ అద్ది ఇవ్వు 
జగతి అంటూ భూషణ్ కుటుంబం నీకు ఇస్తున్న ఆహ్వానం వసుధార అంటుంది దేవయాని.అయితే వసుధారా మాత్రం ఏమి అర్ధం కానట్లు అలానే చూస్తూ ఉంటుంది.అలా చూస్తున్నావ్ వెళ్లి ఆ చీర కట్టుకుని వచ్చి బొమ్మల కొలవులో దీపాన్ని వెలిగించు అంటుంది దేవయాని.మీ పెదనాన్న ఇక్కడ ఉండి ఉంటే బావుండేది ఈ పండుగ రోజుల్లో వెళ్లి వసుధార వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడేవాళ్ళం కదా..ఏదో మీటింగ్ ఉందని వెళ్లిపోయారంటుంది. ఇప్పుడెందుకు అవన్నీ అన్న మహేంద్ర నువ్వెళ్లమ్మా అంటాడు.అప్పుడు వసుధార ఆ చీర తీసుకుంటుంది. 

వసు గురుదక్షణ మాట మర్చిపోయి రిషి ఇచ్చిన చీర కట్టుకుంటుందా..?

Jagathi, vasu

వసుధార మాత్రం…వాగ్ధానం మరిచిపో అన్న మాటలు గుర్తుచేసుకుంటూ అయిష్టంగా ఆ చీర తీసుకుని రూమ్ లోకి వెళుతుంది. పైన రూమ్ కి వెళ్లి ఆ చీర పక్కన పెట్టేసి ఆలోచనలో పడుతుంది..ఇంతలో అక్కడకు జగతి వచ్చి ఏంటి వసు ఆలోచిస్తున్నావ్..చీర కట్టుకో అంటుంది.మేడం రిషి సార్ అంటే నాకు ప్రాణమే కానీ నేను ఇంటి కోడల్ని కావాలంటే దానికి అడ్డంకి మిగిలిపోయింది కదా అంటుంది.ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయంకాదు కదా.కొన్నిటిని చూసీచూడనట్టు వెళ్లాలి.నా మాట విను..చీర కట్టుకో దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు అంటుంది.ఇంతలో మహీంద్ర కూడా వచ్చి వసూ ఏమి ఆలోచించకుండా చీర కట్టుకో అంటే జగతి మాత్రం మహేంద్ర నువ్వు వెళ్ళు మేము వస్తాము అనడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.. ఇక వసు జగతి మాట విని ఆ చీర కట్టుకుంటుందో లేదో అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.






Related posts

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri