NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన కోడికత్తి దాడి నిందితుడు శ్రీను తల్లి సావిత్రి .. అధికారులు ఏమన్నారంటే..?

సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జనిపల్లి శ్రీనివాసరావు ( శ్రీను) కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే అతన్ని అరెస్టు చేశారు. జగన్మోహనరెడ్డి పై జరిగిన ఈ హత్యాయత్నం కేసును తర్వాత ఎన్ఐఏకి బదిలీ చేశారు. అప్పటి నుండి కోడికత్తి శ్రీను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా నే ఉన్నారు. పలు మార్లు బెయిల్ కోసం ధరఖాస్తు చేసినా లభించలేదు. సుమారు నాలుగేళ్లుగా అతను జైలులోనే ఉన్నాడు.

Kodikatthi Accused Srinu Family Came to meet CM Jagan at Camp Office
Kodikatthi Accused Srinu Family Came to meet CM Jagan at Camp Office

 

దీంతో నిందితుడు శ్రీను తల్లి సావిత్రి బుధవారం తమ న్యాయవాదితో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. నేరుగా సీఎం జగన్ ను కలిసి తమ బాధను వ్యక్తం చేయాలని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే సీఎం జగన్ వేరే అపాయింట్ ల కారణంతో బీజీగా ఉండటం వల్ల నేరుగా కలవడం సాధ్యం కాదనీ, స్పందనలో వినతి పత్రం ఇచ్చి వెళ్లాలని సీఎం క్యాంప్ కార్యాలయ అధికారులు వెల్లడించారుట. అపాయింట్మెంట్ ఖరారు చేసి తర్వాత కబురు చేస్తామని అధికారులు తెలిపారని నిందితుడు శ్రీను న్యాయవాది మీడియాకు తెలిపారు.

ఎన్ఐఏ నుండి కేసు ఏపి ప్రభుత్వానికి బదిలీ చేయాలి

జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా నిరంభ్యంతర పత్రం ఎన్ఓసీ ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. తమ కుమారుడు జైలులో ఉండటం వల్ల పోషణ కష్టంగా మారిందని వినతి పత్రంలో శ్రీను తల్లి సావిత్ర పేర్కొంది. ఈ కేసును ఎన్ఐఏ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిందితుడు తరపు న్యాయవాది కోరారు. ఆ మేరకు సీఎం ఆదేశాలు ఇస్తే నాలుగేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనుకు కోర్టు ద్వారా బెయిల్ లభిస్తుందని చెప్పారు. ఈ కేసులో శిక్ష పడేదే అయిదు సంవత్సరాలు అయితే ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉన్నాడని ఆయన తెలిపారు. సీఎం జగన్ మానవతాదృక్పదంతో ఆలోచించి నిందితుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N