NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కీలక మలుపు

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదిక గా జరిగిన ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటోంది. ఆయా పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ముగ్గురుని అరెస్టు చేసి పోలీసులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదికగా జరిగిన ఈ ఘటన పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేయించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ రాష్ట్ర శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు సిట్టింగ్ జడ్జి న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ తన పిటిషన్ లో అభ్యర్ధించింది.

TRS MLAs

 

రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయాలని బీజేపీ కోరింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్ లో బీజేపీ కోరింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ఫిరాయింపు కోసం ప్రలోభ పర్వానికి గురి చేసే క్రమంలో భారీ ఆపరేషన్ ను చేపట్టినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ తరపున పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుజ్జల ప్రేమ్ందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారనీ, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిలో డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్ హెచ్ ఓ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Breaking: ఎమ్మెల్యేల ప్రలోభపర్వాన్ని భగ్నం చేసిన టీఆర్ఎస్ సర్కార్ ..కేసిఆర్ దెబ్బ మామూలుగా లేదుగా..!!

high court gave green signal to demolish telangana secretariat
 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N