Atlee: భారతీయ చలనచిత్ర రంగంలో దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. తెలుగు మరియు కనడం ఇండస్ట్రీకి చెందిన సినిమాలు కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. బాహుబలి, పుష్ప, RRR, KGF, KGF 2 సినిమాలు రీసెంట్ గా కాంతారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవటం జరిగింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన చాలా సినిమాలు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తూ ఉన్నాయి. మరోపక్క బాలీవుడ్ సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.
కనీసం సౌత్ ఇండస్ట్రీ సినిమాలతో కూడా పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు మరియు నిర్మాతలు దక్షిణాది టాలెంట్ నీ నమ్ముకుని సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ బాదుషా కింగ్ ఖాన్ షారుక్ తమిళ దర్శకుడు అట్లీతో “జవాన్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది దీపావళి నాడు ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఇంకా కంప్లీట్ కాకుండానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో అట్లీ సినిమా చేయడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ మీడియాలో తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇటీవల సల్మాన్ ఖాన్ తో అట్లీ చర్చలు జరిపినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విజయ్ తో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అట్లీ అందుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు షారుక్ ఖాన్ తో సినిమా చేస్తున్నారు. షారుక్ మూవీ కంప్లీట్ కాకుండానే సల్మాన్ తో కూడా అట్లీ అవకాశమందుకున్నట్లు వార్త ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!