NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు దక్కని హామీ సింగరేణి కార్మికులకు దక్కింది.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన పీఎం మోడీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఏపి, తెలంగాణలో పర్యటించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏపిలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి ఎటువంటి మాట మాట్లాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తెలంగాణలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో జరిగిన బహిరంగ సభలో సింగరేణి కార్మికులకు మాత్రం ప్రైవేటీకరణ అంశంపై భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తొంది. ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

PM Modi

 

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు నెలలు తరబడి ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ విశాఖ పర్యటనలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇక్కడి స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు భద్రాచలం – సత్తుపల్లి రైల్వే లైన్ ను ప్రారంభించారు. మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని పరిశీలించారు.

ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రామగుండం ఎరువుల ఫాక్టరీతో తెలంగాణతో పాటు ఏపి, కర్ణాటక, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇదే సందర్భంలో సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇచ్చారు ప్రదాన మంత్రి మోడీ. సింగరేణి విషయంలో కొందరు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే ఉందని, కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమే ఉందని లెక్కలతో సహా వివరించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేస్తూ .. సింగరేణి విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్న 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిపారు పీఎం మోడీ. అబద్దపు మాటలను నమ్మవద్దని మోడీ విజ్ఞప్తి చేశారు.

Breaking: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు.. రిక్కర్ స్టేర్ స్కేల్ పై 5.4గా నమోదు

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N