SS Rajamouli: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పాపులారిటీ అంతర్జాతీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. “బాహుబలి 2”, “RRR” రెండు సినిమాలు భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయితోపాటు జక్కన్న ఇమేజ్ అమంతాం పెంచేశాయి. ఈ రెండు సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లెవెల్స్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. “RRR” ద్వారా రాజమౌళి పనితనం పట్ల హాలీవుడ్ ప్రముఖులు చాలామంది ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. అంతేకాదు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా గెలవడం జరిగింది. ఇదే సమయంలో ఆస్కార్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆస్కార్ వస్తే మాత్రం రాజమౌళి రేంజ్ ఇంకా చూసుకో అక్కర్లేదు.
ఇదిలా ఉంటే హాలీవుడ్ ఇండస్ట్రీలో పలు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జక్కన్నతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో రాజమౌళి కూడా హాలీవుడ్ లో సెటిలైపోయే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ పై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. హాలీవుడ్ ఎంట్రీ విషయంలో కాస్త అయోమయం నెలకొన్నట్లు స్పష్టం చేశారు. దానికి కారణం కూడా తెలియజేశారు.”ఇండియాలో నేనే డిక్టేటర్ ని… సినిమా ఎలా తీయాలో నాకు ఎవరు చెప్పరు. అయితే హాలీవుడ్ లో ప్రాజెక్టు చేస్తే నా గుర్తింపు మరింత రెట్టింపు అవుతుంది. హాలీవుడ్ లో నా తొలి అడుగు ఎవరితోనైనా కలిసి పని చేయటమే అవుతుంది అని జక్కన్న వ్యాఖ్యానించారు.
కాగా నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా కన్ఫామ్ కావటం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే నాడు మే 31 వ తారీకు చేయనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడుదల రీతిలో…ప్లాన్ చేస్తున్నట్లు… “RRR” ద్వారా వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకునే తరహాలో.. జక్కన్న ప్లాన్ వేసినట్లు టాక్. సో మొదట అనుకున్నా బడ్జెట్ కంటే ఇప్పుడు మరింతగా పెరిగినట్లు దాదాపు ₹1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో మహేష్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!