NewsOrbit
Entertainment News OTT సినిమా

OTT REVIEW: నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన త్రిష లేడీ ఓరియంటెడ్ “రాంగీ”..సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..?

OTT REVIEW: “పొన్నియిన్ సెల్వన్” వంటి భారీ పెద్ద సినిమా తర్వాత.. త్రిష నటించిన సినిమా “రాంగీ”. జర్నలిస్టు పాత్రలో లేడీ ఓరియంటెడ్ తరహాలో వచ్చిన ఈ సినిమా.. గత ఏడాది డిసెంబర్ 30వ తారీకు రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సినిమా పేరు: రాంగీ
దర్శకుడు: ఏమ్. శరవణన్
నటీనటులు: త్రిష, అనస్వరా రాజన్, లిజ్జి అంతోని, జాన్ మహేంద్రన్, గోపి కన్నడేసన్, వాకార్ ఖాన్.. తదితరులు.
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్
సంగీతం: సి.సత్య
ఓటిటి సంస్థ: నెట్ ఫ్లిక్స్.
Trisha Krishan's Raangi movie ott review in telugu
Trisha Raangi movie review in telugu
పరిచయం:

త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా “రాంగీ” గత ఏడాది 30వ తారీకు రిలీజ్ కావటం జరిగింది. టాప్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అందించిన కథతో ఈ చిత్రాన్ని ఎంగేఎం ఏప్పుదాం సినిమా ఫేమ్ ఎం శర్వనణ్ దర్శకత్వం వహించడం జరిగింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకి సి. సత్య సంగీతాన్ని అందించారు. వాస్తవానికి ఈ సినిమా 2021 లోనే రిలీజ్ కావలసి ఉండగా అనేక కారణాల వల్ల కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఫ్యామిలీ మరియు కామెడీ ఇంకా సెంటిమెంట్, యాక్షన్ వంటి అంశాలతో విభిన్నమైన కథాంశంతో “రాంగీ” తెరకెక్కటం జరిగింది. ఓ విలేఖరిగా త్రిష ఈ సినిమాలో నటించారు. చిత్రం దాదాపు సగభాగం ఉజ్బెకిస్తాన్ లో చిత్రీకరించడం జరిగింది. త్రిష వాళ్ళ అన్నయ్య కూతురికి ఏర్పడిన సమస్యలను విలేకరిగా… దాన్ని ఎలా పరిష్కరించింది అనేది ఈ సినిమా యొక్క స్టోరీ. “రాంగీ” సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Trisha Krishan's Raangi movie ott review in telugu
Trisha Krishan’s Raangi now streaming on Netflix
స్టోరీ:

ఓ ఆన్ లైన్ రిపోర్టర్ గా తైయాల్(త్రిష) పనిచేస్తుంటది. జర్నలిజం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో సమాజంలో పేరుగాంచిన రాజకీయ నేతలు పోలీసులు వారు చేసే అవినీతిని ఎంతగానో అసహ్యించుకుంటది. సమాజానికి ఏదైనా చేయాలి అన్న తపనతో జర్నలిజంలో చాలా నీతిగా నిజాయితీగా ఉంటది. ఈ క్రమంలో ఓ పోలీస్ తో కూడా తైయాల్ గొడవ పెట్టుకోవడం అతని అవినీతిని వీడియో ద్వారా చిత్రీకరించడం జరుగుద్ది. కాగా తైయాల్ కీ ఓ అన్నయ్య కూడా ఉంటాడు. అతనికి సుస్మిత అనే అమ్మాయి ఉంటది. అయితే ఓ రోజు తైయాల్ వాళ్ళ అన్నయ్యకి ఎవరో అగంతకులు నుండి ఫోన్ వస్తాదీ. మీ కూతురు న్యూడ్ ఫోటోలు.. వీడియోలు మా దగ్గర ఉన్నాయని బ్లాక్ మెయిల్ కాల్ చేయడం జరుగుతుంది. దీంతో ఎంతో మదన పడుతున్న తన అన్నయ్యనీ చూసి తైయాల్ విషయం తెలుసుకుంటది. తన అన్నయ్య కూతురు సుస్మితని అనేక ప్రశ్నలు వేసి సోషల్ మీడియా ఎకౌంట్స్ గురించి ప్రశ్నిస్తాది. ఇంతకీ ఆ అమ్మాయికి అసలు సోషల్ మీడియా అకౌంట్ ఉండదు. కానీ సుస్మిత వాళ్ళ స్కూల్ ఫ్రెండ్… సుస్మిత ఫోటో ద్వారా ఫేక్ ఫేసు బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఉగ్రవాదుల గ్రూప్ తో సంబంధం ఉన్న వ్యక్తితో చాటింగ్ చేయడం జరుగుతుంది. దీంతో త్రిష సుస్మిత స్కూల్ ఫ్రెండ్ నుండి ఆ ఐడి మొత్తం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఆ ఐడీలో ఇష్టానుసారంగా మెసేజ్ లు పెట్టే వారికి అసలు విషయం తెలియజేస్తది. పొరపాటున ఇది వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఐడి. ఆ అకౌంట్ లో ఉన్న ఫ్రెండ్స్ కీ.. సుస్మిత అనే అమ్మాయికి..ఈ ఫేక్ అకౌంట్ కీ  సంబంధం లేదు అని చెప్పుద్ది. కానీ ఆ ఉగ్రవాదులతో సంబంధం కలిగిన కుర్రోడు మాత్రం మెసేజ్ చేస్తున్నే ఉంటాడు. దీంతో ఆ ఐడినీ తైయాల్..బాగా పరిశీలించగా అందులో ఉగ్రవాదుల గుంపుతో దేశ ప్రధానికి లింక్ ఉండటం అన్ని విషయాలు బయటపడతయి. దీంతో తైయాల్… ఆ ఫోటోలు మరియు వీడియోలు తన ఆన్ లైన్ మీడియా విభాగంలో రిలీజ్ చేసి వైరెల్ చేసి పేరు సంపాదిస్తాది. దీంతో ఉగ్రవాదుల గుంపు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుద్ది. అయితే అదే ఉగ్రవాదుల గుంపులో ఆలిమ్… అనే వ్యక్తి సుస్మితని ప్రేమించడం జరుగుతుంది. ఆలిమ్..ఐడీ ఎకౌంటు నుండే సుస్మితకి మెసేజ్ లు వస్తాయి. ఈ క్రమంలో సుస్మిత ఎకౌంటు..తైయాల్ స్వాధీనం చేసుకుని ఉగ్రవాదుల నుండి అనేక విషయాలు రాబట్టడానికి..ఆలీమ్ తో క్లోజ్ గా చాటింగ్ చేస్తాదీ. ఈ క్రమంలో ఆలీమ్ ప్రవర్తన నచ్చటంతో తైయాల్ మనసు పారేసుకుంటది. అతడిని ఉగ్రవాదుల వాతావరణం నుండి విముక్తి చేయడానికి తన ప్రయత్నాలు చేస్తది. ఇదిలా ఉంటే ఒక్కరోజు FBI పోలీసులు…తైయాల్ నీ సుస్మిత అని అరెస్టు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా… ఉగ్రవాదులు… ఉండే ప్రదేశాన్ని ఈ విదేశీ పోలీసులు కనిపెట్టేస్తారు. దీంతో ఆలిమ్ వలనే కష్టాలు వచ్చాయని ఆ ఉగ్రవాదులు… విదేశీ పోలీసులను …తైయాల్, సుస్మితని కూడా చంపేయాలని డిసైడ్ అవుతారు. కానీ ఉగ్రవాదులను పోలీసులు మట్టు పెట్టడం జరుగుతుంది. ఈ గొడవలలో ఆలీమ్… తన ప్రాణాలను పోగొట్టుకుంటాడు. కానీ చివరిలో.. మరో జన్మ అంటూ ఉంటే భారతదేశంలో పుట్టాలని.. భగవంతుని కోరుకుంటానని అలీమ్… తన సోషల్ మీడియా అకౌంట్లో వాయిస్ పెట్టడం జరుగుతుంది. దీంతో ఆ వాయిస్ విని తైయాల్… కన్నీరు పెట్టుకుంటుంది. జర్నలిస్టుగా “ఆలిమ్” వ్యక్తిత్వం పై పుస్తకం రాయడం జరుగుతుంది.

Trisha Krishan's Raangi movie ott review in telugu
Trisha Krishan’s Raangi movie
విశ్లేషణ:-

“రాంగీ” సినిమా స్టోరీ స్టార్టింగ్ లోనే త్రిషని ఆరెస్ట్ చేయటంతో స్టోరీపై కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది. మొదట అరగంట బాగానే ఉన్నా తర్వాత స్టోరీలో ఎంటర్టైన్మెంట్ కి పెద్దగా ఆస్కారం లేని సినిమా. ఏఆర్ మురుగదాస్ బలమైన స్టోరీ అందించిన గాని… స్టార్టింగ్ అరగంట పాటు అడల్ట్ కంటెంట్ గట్టిగా ఉంది. ప్రారంభం బాగున్నా గాని స్టోరీ నడిపించే విధానం పెద్దగా ఆకట్టుకోదు. టీనేజ్ వయసులో ఉన్న ప్రేమ కథని.. ఉగ్రవాదులతో ముడి పెట్టడం దానికి FBI వంటి సంస్థలు రంగంలోకి దిగటం… వంటి సన్నివేశాలను చాలా బలంగా చూపించలేకపోయారు. మరి ముఖ్యంగా 37 సంవత్సరాల వయసున్న త్రిష… 17 సంవత్సరాల వయసున్న ఉగ్రవాది చాటింగ్ కి ఆకర్షించబడటం కూడా కామెడీగానే ఉంటది. ఫ్యామిలీ, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ వంటి అంశాలతో.. తెరకెక్కిన “రాంగీ”.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా థ్రిల్లర్ కంటెంట్ నీ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తరహా గా చూపించడం పెద్ద మైనస్.

ప్లస్ పాయింట్స్:

స్టోరీ.
సినిమాటోగ్రఫీ.
ఆలిమ్ పాత్ర.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
త్రిష.

మైనస్ పాయింట్స్:

సినిమాలో రొమాంటిక్ పార్ట్.
త్రిష ఓవర్ యాక్షన్.
యాక్షన్ సీన్స్.

ఓవరాల్ గా: “రాంగీ” కొత్తదనం ఖాతా అయినా గాని… చిన్నపాటి ప్రేమ పెద్ద మైనస్.

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri