NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్

MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత సింగిల్ బెంచ్ ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా విచారణ జరిపిన ధర్మాసనం నిన్న కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పునే సమర్దిస్తూ.. హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ సీబీఐ అమలు చేయాలని ఆదేశించింది. ఈ సమయంలో సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, అప్పటి వరకూ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్ధించారు. అయితే ప్రభుత్వ అభ్యర్ధనను ధర్మాసనం తోసి పుచ్చించి.

TRS MLAs poaching case

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ సింగిల్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.. సీజే అనుమతి తీసుకోవాలని ఏజికి సూచిస్తూ విచారణను రేపటికి వాయిదా వేశారు. ఇదే క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవేళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలని ధర్మాసనాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే .. సాక్షాలు ధ్వంసం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

TRS MLAs poaching case

 

రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయిన ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం కేసులో ఇప్పటికే అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ కేసు ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ కేసు బీఆర్ఎస్, బీజేపీ మద్య ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కేసు విషయంలో ఆయా పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్దం జరిగింది. ఈ కేసు దర్యాప్తు సిట్ ద్వారా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుండగా, నిందితులు, బీజేపీ సీబీఐ దర్యాప్తు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు కాగా సుప్రీం కోర్టులో వచ్చే వారం జరిగే విచారణ లో ఎటువంటి తీర్పు వెలువరిస్తుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

కాగా  ఈ కేసులో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. సిట్ అధికారులు వారిని కస్టడీ విచారణ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ నిందితులు ముగ్గురికి బెయిల్ మంజూరు కాగా జైలు నుండి విడుదల అయ్యారు.

YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?