NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ రాజకీయ చతురత .. శాసనమండలి డిప్యూటి చైర్మన్ గా బండా ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో సారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు శాసనమండలి డిప్యూటి చైర్మన్ గా అవకాశం కల్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజ్(బీసీ) సామాజికవర్గానికి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఈ సామాజిక వర్గ ఓటింగ్ ను ఆకర్షించేందుకు టీడీపీ .. కాసానికి పెద్ద పీట వేయడంతో అదే సామాజికవర్గానికి చెందిన నేతకు కేసిఆర్ శాసనమండలి డిప్యూటి చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

Banda Prakash as deputy chairman of telangana legislative council

 

ఆదివారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ కు సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బండా ప్రకాశ్ డిప్యూటీ చైర్మన్ కావడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. సామాన్య జీవితం నుండి బండా ప్రకాష్ ఎదిగారని, ముదిరాజ్ ల అభివృద్ధికి ప్రకాష్ ఎంతో కృషి చేశారంటూ ఈ సందర్భంగా ప్రశంసించారు. బండా ప్రకాష్ ..1981 లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2017లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైయ్యారు. 2018 మార్చి 23న టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2021 నవంబర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు.  తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడుగానూ ఉన్నారు.

Banda Prakash as deputy chairman of telangana legislative council

 

మంత్రి కేటిఆర్ తదితర మంత్రులు బండా ప్రకాష్ కు అభినందనలు తెలియజేస్తూ ముదిరాజ్ కమ్యూనిటీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అధికార బీఆర్ఎస్ తీసుకున్న ఈ కీలక చర్యతో ముదిరాజ్ సామాజికవర్గం ఏకపక్షంగా కాసాని వైపు మళ్లకుండా అడ్డుకట్ట వేసినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బండా ప్రకాష్ శాసనమండలి డిప్యూటి చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల ఆ సామాజికవర్గ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్ గా న్యాయకోవిదుడు నియామకంతో ఇక ఏపీ సీఎం జగన్ కు తలనొప్పులు తప్పవా..?

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju