29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్

Share

ఏపి నూతన గవర్నర్ గా రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇక్కడ గవర్నర్ గా ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహించిన బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్‌గడ్ గవర్నర్ గా బదిలీ అయ్యారు. గవర్నర్ బదిలీ, నూతన గవర్నర్ నియామకంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జస్టిస్ నజీర్ అనుభవం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలోనూ, రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలోనూ ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.

CM YS Jagan, Governor Abdul Nazeer

 

ఇక చత్తీస్‌గఢ్ గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఏపి గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ అందించిన సేవలను కొనియాడారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ మరువలేని సహకారం అందించారని సీఎం జగన్ పేర్కొన్నారు.


Share

Related posts

Bariatric: ఈ ఆపరేషన్ చేయించుకుంటే స్లిమ్ అవుతారట..!

bharani jella

జగన్ నూతనంగా ప్రారంభించిన వైఎస్ఆర్ తేలే మెడిసిన్

Siva Prasad

పూజా హెగ్డే ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తుందో ..?

GRK