NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి ..గన్నవరంలో హైటెన్షన్

కృష్ణాజ్లిలా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడికి దిగారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించారు. టీడీపీ, వైసీపీ నేతల వ్యాఖ్యలతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై గన్నవరం ఎమ్మెల్యే వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు వంశీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు చేసిన వంశీపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ నాయకుడినే విమర్శిస్తారా అంటూ వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు.

mla vamshi followers attack on gannavaram tdp office

 

కార్యాలయంలో కంప్యూటర్ లు , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. ఈ దాడి ఎమ్మెల్యే వంశీ అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద దాడి ఘటన నేపథ్యంలో చెన్నై – కోల్ కతా జాతీయ రహదారిపకి ఇరువైపులా టీడీపీ, వైసీపీ శ్రేణులు మోహరించాయి. అప్సర ధియేటర్ సమీపంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.  అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు ఈ క్రమంలో సీఐ కనకారావుకు గాయాలైయ్యాయి. హైవేపై మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

High Tension In Gannavaram

 

అనంతరం టీడీపీ శ్రేణులు హైవేపై భైటాయించి ఆందోళనకు దిగారు. దీంతో మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఈ ఘటనపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకి రాజకీయ బిక్ష పెట్టిన టీడీపీ కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే వంశీ, కొడాలి నాని తదితరులు టీడీపీ నుండి ఎందుకు బయటకు వెళ్లిపోయారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

బీసీలకు పెద్ద పీట ..  వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే

High Tension In Gannavaram

 

 

Related posts

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju