25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీసీలకు పెద్ద పీట …  వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే

Share

ఏపిలో స్థానిక సంస్థ కోటా, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను వైసీపీ ప్రకటించింది. ఎమ్మెల్సీల ఎన్నికల్లో వైసీపీ బీసీలకు పెద్ద పీట వేసింది. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ అభ్యర్ధుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారని తెలిపారు. సామాజిక న్యాయానికి వైసీపీ కట్టుబడి ఉందని అన్నారు సజ్జల. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని తొలి నుండి జగన్మోహనరెడ్డి చెబుతున్నారనీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఓట్ల కోసం నినాదాలు ఇచచే పార్టీ మాది కాదనీ, వారిని అదికారంలో భాగస్వామ్యం చేశామని తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా ఆయన వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy Announce AP MLC Candidates list

 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే .. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీలకు ఏకంగా 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని తెలిపారు. మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 6 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు కేవలం మాటలు చెబితే తాము చేతల్లో చూపించామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో తొమ్మిది మంది అభ్యర్ధులు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరు పేర్లను ప్రకటించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 బీసీలకు, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి, ఒసిలకు నాలుగు స్థానాలు కేటాయించారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు

  • సత్తు రామారావు (శ్రీకాకుళం, బీసీ యాదవ)
  • కడుపూడి సూర్యనారాయణ (తూర్పు గోదావరి , బీసీ – శెట్టి బలిజ)
  • వంకా రవీంద్రనాథ్ (పశ్చిమ గోదావరి, పారిశ్రామికవేత్త)
  • కవురు శ్రీనివాస్ .. పశ్చిమ గోదావరి జిల్లా, బీసీ – శెట్టి బలిజ)
  • మేరుగ మురళి .. నెల్లూరు (ఎస్సీ – మాల)
  • డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం .. చిత్తూరు
  • రామసుబ్బారెడ్డి . (కడప, ఓసీ, – రెడ్డి)
  • డాక్టర్ మధుసూధన్ .. (కర్నూలు – బీసీ – బోయ)
  • ఎస్ మంగమ్మ .. అనంతపురం (బీసీ – బోయ)

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు

  • పెనుమత్స సూర్యనారాయణ .. విజయనగరం (క్షత్రయ)
  • పోతుల సునీత ..ప్రకాశం (బీసీ – పద్మశాలి)
  • కోలా గురువులు .. విశాఖ (బీసీ – ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్)
  • బొమ్మి ఇజ్రాయిల్ .. తూర్పు గోదావరి (ఎస్సీ – మాదిగ)
  • జయమంగళ వెంకటరమణ .. పశ్చిమ గోదావరి (వడ్డీల సామాజిక వర్గం)
  • ఏసురత్నం .. గుంటూరు జిల్లా (బీసీ – వడ్డెర)
  • మర్రి రాజశేఖర్ .. గుంటూరు జిల్లా (కమ్మ)

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు

  • కంభా రవి .. అల్లూరి సీతారామరాజు జిల్లా (ఎస్సీ)
  • కర్రి పద్మశ్రీ .. కాకినాడ జిల్లా (బీసీ)

శివసేన అధికారిక గుర్తింపు అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్దవ్ ఠాక్రే

 


Share

Related posts

‘అమరావతిని ఆపడానికి జగన్ కుట్ర!?’

somaraju sharma

Patanjali : పతంజలి రాందేవ్ బాబా కి ముప్పు తెచ్చిన కరోనా..! ఛీటింగ్ కేసులో అరెస్టు…?

siddhu

Kalyan Singh: బిగ్ బ్రేకింగ్..యుపి మాజీ సింగ్ కల్యాణ్ సింగ్ కన్నుమూత

somaraju sharma