NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: ‘మహా’ శివసేన పంచాయతీ.. సుప్రీం కోర్టులో ఉద్దవ్ వర్గానికి లభించని ఊరట

Supreme Court:  మహారాష్ట్ర శివసేన పంచాయతీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల అధికారికంగా గుర్తించింది. పార్టీ ఎన్నికల గుర్తు ధనస్సు, బాణం గుర్తును షిండే వర్గానికే కేటాయించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, నేడు విచారణ జరిగింది. అయితే ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈసీ నోటిఫికేషన్ పై ఎక్ నాథ్ శిండే వర్గానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరో వారం రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్లను అదేశించింది. శివసేనలో చీలిక అనంతరం చీలిక వర్గం నేత ఏక్ నాథ్ శిండే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమదే అసలైన శివసేన అంటూ ఏక్ నాథ్ శిండే, ఉద్దవ్ ఠాక్రే వర్గాలు ప్రకటించుకున్నాయి.

 

అయితే ఈ సమస్య ను పరిష్కరించేంత వరకూ ఇరువర్గాలు వేర్వేరు గుర్తులు ఉపయోగించుకోవాలని తొలుత సూచించిన ఈసీ.. తాజాగా ఏక్ నాథ్ శిండే నేతృత్వంలోని పార్టీనే అసలైన శివసేన అని ఈసీ గుర్తిస్తూ ఇటీవల నిర్ణయాన్ని వెలువరించింది. దీనిపై శిండే వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే భావజాలం సాధించిన విజయమని శిండే అభివర్ణించారు. ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసిన శిండే ..తమదే నికార్సయిన శివసేన అని తేలిందన్నారు. బాలా సాహెబ్ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకుని తాము బీజేపీతో కలిసి గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

అయితే శివసేన పార్టీ అధికారిక గుర్తింపునకు ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నది అనే విషయంపై ఈసీ వివరణ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారనీ, వారందరి మద్దతు ఏక్ నాథ్ శిండే కు ఉందని వివరించింది. అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని పేర్కొంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అధికారిక శివసేన గుర్తింపు అంశం మరో సారి వివాదాస్పదం అయ్యింది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju