NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మాజీ సీఎం నివాసానికి సీబీఐ అధికారులు ..ఆర్జేడీ ఫైర్

రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తొందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాసిన మరుసటి రోజే బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సోమవారం రబ్రీ దేవి నివాసానికి చేరుకున్న సీబీఐ అదికారులు .. ఆమెను ఉద్యోగాల కుంభకోణం కేసులో ప్రశ్నించారు. అయితే తాము ఆమె నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించలేదనీ, కేవలం రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపారు. రబ్రీ దేవి అపాయింట్ మెంట్ తీసుకున్న తర్వాతనే ఆమె ను ప్రశ్నించినట్లు సోమవారం వెల్లడించారు.

CBI Examines rabri devi in land for jobs scam case

 

మాజీ సీఎం ఇంటికి సీబీఐ అధికారులు రావడంపై ఆర్జేడీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీకి రాసిన లేఖపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా సంతకం చేశారనీ, అందుకే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. రబ్రీ దేవి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లడాన్ని ఆయన ఖండించారు. సీబీఐ అదికారుల చర్య ఆమెను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, గవర్నర్ లతో కేంద్రం ఇబ్బందులు పెడుతూ ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనివ్వడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. అందరూ కలిసి పని చేస్తేనే ప్రజాస్వామ్యం ముందుకు సాగుతుందని అన్నాడు. తేజస్వి యాదవ్ పై ఒత్తిడి తీసుకురావడానికే కేంద్రం సీబీఐ దాడులు చేయిస్తొందని సుప్రీం కోర్టు  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో గ్రూప్ – డీ ఉద్యోగాలు ఇప్పించి ఆ డబ్బుతో భూమిని కొనుగోలు చేశారని సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. పట్నా జోన్ కు చెందిన కొందరికి ముంబయి, కోల్ కతా, జబల్ పుర్, జైపుర్ వంటి జోన్లలో ఉద్యోగాలు ఇప్పించారని, అందుకు బదులుగా ఆ అభ్యర్ధులు, వారి కుటుంబ సభ్యులు తమ భూములను లాలూ ప్రసాద్ కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి బదిలీ చేశారనేది సీబీఐ అభియోగం. ఈ కేసులో సిబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ ప్రసాద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది, ఈ కేసుపైనే రబ్రీదేవిని సీబీఐ విచారిస్తొంది. దీనిపై అదనపు సమాచారం కోసం తాజాగా రబ్రీదేవి నివాసానికి వెళ్లినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయింటూ ఆరోపిస్తూ ఆదివారం ప్రధాని మోడీకి ఎనిమిది విపక్ష పార్టీల నేతలు లేఖ రాసిన తరువాత ఈ పరిణామం జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

జీఐఎస్ సక్సెస్ తో వైసీపీ విజయోత్సవ సంబరాలకు ప్లాన్ .. ఎలా అంటే ..?

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !