NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MLA Quota MLC Election: ఆ ఇద్దరు ఎవరు..? వైసీపీలో అంతర్మధనం..!!

MLA Quota MLC Election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఏపి అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా బలం లేకపోవడంతో వైసీపీ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను బరిలోకి దింపింది. అయితే అనూహ్యంగా టీడీపీ పంచుమర్తి అనురాధను పోటీకి నిలపడంతో వైసీపీ ఏకగ్రీవంపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. టీడీపీ ఊహించినట్లుగానే వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ జరిగింది. వాస్తవంగా టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ టీడీపీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కొద్ది నెలలకే వైసీపీకి మద్దతుగా మారిపోయారు. అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లు స్పష్టం అవుతోంది.

AP MLC Election

 

వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలుగా ఉన్న అనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసినట్లుగా భావిస్తున్నా మరో ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ పంచుమర్తి అనురాధను పోటీకి దించిన నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమై.. ఏ ఒక్కరూ చేజారిపోకుండా 22 మంది ఎమ్మెల్యేలకు ఒక సీనియర్ నేత/ మంత్రిని ఇన్ చార్జిని ఏర్పాటు చేసి బుధవారం రాత్రి క్యాంప్ రాజకీయానికి తెరి తీసింది. అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలను బుజ్జగింపులు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

కాగా రెండో ప్రాధాన్యత ఓట్లతో  వైసీపీ అభ్యర్ధి జయమంగళం వెంకట రమణ గెలుపొందగా, కోలా గురువులు ఓటమి పాలైయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జయమంగళం వెంకట రమణ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ హామీతో వైసీపీలో చేరారు. ఇక వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపై ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇద్దరు ఎవరు అనేది తేల్చే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. ఈ పరిణామంపై సీనియర్ నేతలు చర్చిస్తున్నారని సమాచారం.

ఫలించిన చంద్రబాబు వ్యూహం.. ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella