NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Balineni: సీఎం జగన్ తో భేటీ తర్వాత బాలినేని చేసిన కీలక కామెంట్స్ ఇవి

Balineni: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పట్ల అసంతృప్తి గా ఉన్నారనీ, అందుకే రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో గురువారం సీఎం జగన్మోహనరెడ్డితో బాలినేని భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బాలినేని తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. జిల్లాకే చెందిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంలో గత కొంత కాలంగా వివాదం నడుస్తొంది. తాను పార్టీ టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తన పై వివాదాలు సృష్టిస్తూ, సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని భావోద్వేగానికి గురై కంట తడి కూడా పెట్టారు.

Balineni Srinivasa Reddy

తాజాగా బాలినేనికి సీఎం కార్యాలయం నుండి కబురు రావడంతో గురువారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి సీఎం జగన్ తో బాలినేని చర్చించేందుకు సమావేశమైనట్లు తెలుస్తొంది. మరో పక్క రీజనల్ కోఆర్డినేటర్ పదవిలో కొనసాగాలని బాలినేనికి సీఎం జగన్ విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా సీఎం జగన్ తో భేటీ ముగిసిన తర్వాత బాలినేనిని కలిసిన మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు గతంలోనే  సీఎం జగన్ తో చర్చించానన్నారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్నా ఇబ్బందుల పై  కూడా సీఎం కి వివరించాననీ, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదని అన్నారు. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉందన్నారు. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా చర్చ జరగలేదని ఆయన చెప్పారు. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశానని తెలిపారు.

నియోజకవర్గం మీద దృష్టి పెట్టమని చెప్పారన్నారు. తాను ప్రతిపాదించిన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు బాలినేని. తన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబందించి రూ.200 కోట్లు శాంక్షన్ చేయాల్సి ఉండగా, ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేశారనీ, ఇంకా రూ.170 కోట్లు విడుదల చేయాల్సి ఉందనీ, ఆ విషయం ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. త్వరలో ఒంగోలులో పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ కి సీఎం వస్తారని బాలినేని తెలిపారు. తనకు అలక అంటూ ఏమి లేదని చెప్పారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మారతారు అంటూ వస్తున్న వార్తలపై మీడియా ప్రశ్నించగా, ఆ అవసరం ఏముంది, ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయని బాలినేని తెలిపారు.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం .. అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N