Brahmamudi june 2nd Episode: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ‘బ్రహ్మముడి’ డైలీ సీరియల్ ప్రస్తుతం టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ ఇప్పుడు 112 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఇప్పుడు చూద్దాము.

Brahmamudi: రాహుల్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న వెన్నెల మరియు అరుంధతి..తర్వాత ఏమి జరిగిందంటే!
అపర్ణ ని తప్పుబట్టిన అరుంధతి :
తన బండారం మొత్తం బయటపడిన తర్వాత కూడా రాజ్ వద్ద నేను ఏమి తప్పు చెయ్యలేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న రాహుల్ చెంప పగలగొడుతాడు రాజ్.ఆ తర్వాత రాజ్ మాట్లాడుతూ ఆరోజు మన కంపెనీ లో చేయించిన లేటెస్ట్ డిజైన్ ఉంగరాన్ని వీడు లాక్కొని పోయాడు గుర్తుందా పిన్ని, అది నా నుండి స్వప్న చేతికి తొడిగి ఆమెని వశపరుచుకొని పెళ్లిమండపం నుండి లేపుకుని వెళ్ళిపోయాడు ఈ దుర్మార్గుడు అని అంటాడు. ఆ తర్వాత అరుంధతి ఇలాంటి నీచుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఎలా ఉన్నావ్ అపర్ణ, నిన్ను నమ్మే కదా నేను నా కూతుర్ని వీడికి ఇచ్చి చేద్దాం అనుకున్నది అంటూ అపర్ణ ని నిలదీస్తుంది, సమయానికి వచ్చి ఈ దుర్మార్గుడి నుండి నా కూతుర్ని కాపాడినందుకు కావ్య కి కృతఙ్ఞతలు తెలియచేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి.

Krishna Mukunda Murari: ముకుంద కి రేవతి వార్నింగ్.. ముకుంద తర్వాతి ప్లాన్ అమలు చేయనుందా….
రుద్రాణి దుగ్గిరాల కుటుంబానికి చెందినది కాదని తెలుసుకున్న కనకం:
మరో పక్క కనకం కూతురు జీవితం నాశనం అయిపోయిందే అని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కావ్య మరియు అప్పు స్వప్న ని తీసుకొని ఇంటికి వస్తారు. ఇదేంటి మీతో కలిసి వస్తుంది అని కావ్యాని అడగగా, మా ఇంటి నుండి వస్తుంది అని సమాధానం చెప్తుంది కావ్య. మీ ఇంటి నుండి వస్తుందా?, ఎందుకు మళ్ళీ మీ పరువు తియ్యడానికా అని అడగగా, స్వప్న ని మోసం చేసి కడుపు చేసింది రుద్రాణి కొడుకు రాహుల్ అని చెప్తుంది కావ్య. అన్నయ్య వరుసకు వచ్చే రాహుల్ తో ఇలాంటి దరిద్రపు పని చేస్తావా అంటూ స్వప్న చెంప పగలకొడుతుంది కనకం. అప్పుడు కావ్య రుద్రాణి ఆ ఇంటి సభ్యురాలు కాదని,తాతయ్య దగ్గర పని చేసే PA కూతురు అని, అతను చనిపోయాక రుద్రాణిని తన కుటుంబంలో చేర్చుకొని , ఆమెని చదివించి ఇంత పెద్దదానిని చేసాడు అంటూ కావ్య అసలు నిజం చెప్తుంది. ఇప్పుడు ఈ స్వప్న కి న్యాయం ఎలా చెయ్యాలి, ఆ రాహుల్ దీనిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా అని అడుగుతుంది కనకం.

Nuvvu Nenu Prema: అను పెళ్లి ఆపడానికి కృష్ణ ప్లాన్ ఫలించనుందా… పద్మావతి మనసులో మాట చెప్పినట్టేనా…
రాహుల్ – స్వప్న పెళ్ళికి ముహూర్తం ఫిక్స్:
ఇక రుద్రాణి తన కొడుకు రాహుల్ చెంప పగలకొట్టి ఎంత పని చేసావు రా అని నిలదీస్తుంది. నిన్ను ఒక పెద్ద ఇంటి కుటుంబానికి అల్లుడిని చేసి, వేల కోట్ల రూపాయిల ఆస్తికి అధిపతిని చేయాలనుకున్నాను, కానీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్. ఇప్పుడు దిక్కు మొక్కులేని ఒక పేద ఇంటి పిల్లకు తాళికట్టబోతున్నావు అని అంటుంది. అప్పుడు రాహుల్ ‘స్వప్న’ నన్ను రిచ్ అమ్మాయి అని నమ్మించింది, రాజ్ కి అంత రిచ్ అమ్మాయిని దక్కకుండా చేసి నేను పెళ్లి చేసుకొని వాడిని దెబ్బ కొట్టాలని చూసాను, చివరికి ఇలా అయ్యింది అంటూ రాహుల్ రుద్రాణి తో అంటాడు.మరోపక్క రాజ్ తన తాతయ్య మరియు అమ్మమ్మ తో కలిసి స్వప్న ఇంటికి వస్తారు.

మా రక్త సంబంధం లేని వ్యక్తి నుండి మీ అమ్మాయికి తీరని అన్యాయం జరిగింది, ఇప్పుడు న్యాయం చెయ్యడానికే వచ్చాము అని అంటారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది, తదుపరి ఎపిసోడ్ ప్రోమో లో ‘రెండు రోజుల్లో స్వప్న కి మరియు రాహుల్ కి పెళ్లి జరగబోతుంది, అది మాట్లాడడానికే మేము వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాము’ అని అంటారు. అప్పుడు రుద్రాణి ఇందుకు నేను ఒప్పుకోను అంటుంది, ఒప్పుకోకపోతే మా అక్క చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను అని బెదిరిస్తోంది కావ్య , తర్వాత ఏమి జరిగింది అనేది తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.