NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే – రాహుల్

Rahul Gandhi: కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయూత పేరుతో వృద్ధులకు, వితంతువులకు రూ.4వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. పోడు భూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణ కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకే జోడో యాత్ర చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విద్వేషం తొలగించే ప్రయత్నం చేశాననీ, అది కాంగ్రెస్ పార్టీ సిద్దాంతమన్నారు. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్ధించిందన్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని ఇక్కడ మనుషుల్లో కాంగ్రెస్ రక్తం ఉందన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న భట్టి విక్రమార్కకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు.

Rahul Gandhi Speech in khammam

 

ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఓ స్వప్తంగా ఉండేదనీ, తెలంగాణ పేదలు, రైతులు అందరికీ ఓ స్వప్తం అయితే తొమ్మిదేళ్ల పాటు ఆ కలను బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిఫ్తేదార్ పార్టీ (బీజేపీ బంధువుల పార్టీ) గా అభివర్ణించారు. సీఎం కేసిఆర్ తెలంగాణ రాజుగా భావిస్తున్నారనీ, ఈ రాష్ట్రం ఆయన జాగీరు అనుకుంటున్నారనీ అన్నారు. ధరణి తో భుములు ఎలా దోచుకుంటున్నారో భారత్ జోడో యాత్ర సందర్భంలో తనకు ప్రజలు చెప్పారన్నారు. మిషన్ భగీరథలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ, అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాలను కేసిఆర్ దోచుకున్నారన్నారు. పార్లమెంట్ లో బీజేపీకీ బీఆర్ఎస్ బీ టీమ్ గా పని చేసిందని విమర్శించారు.

రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. కేసిఆర్ రిమోట్ ప్రధాని మోడీ చేతిలో ఉందని  అన్నారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో రైతులు, ఆదివాసీలు, పేదలు అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచారనీ, తెలంగాణలోనూ ఇదే జరగబోతున్నదని అన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందన్నారు. తొలుత ఇక్కడ ముక్కోణపు పోటీ అనుకున్నారనీ, కానీ బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించిన విధంగానే తెలంగాణలో బీజేపీ బీటీమ్ ను ఓడించబోతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఒప్పందం ఉండదని స్పష్టం చేశారు.  ఇటీవల ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ వస్తే తాము హజరు కాబోమని ముందుగానే చెప్పామన్నారు రాహుల్ గాంధీ. కేసిఆర్ అవినీతికి ప్రధాని మోడీ అండదండలే కారణమని అన్నారు. కేసిఆర్ ఏ స్కామ్ లు చేశారో కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మోడీకి తెలుసుననీ, అందుకే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

 

రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో వేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కేసిఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విదంగా దాదాపు 8 వేల మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతుల రుణ మాఫీ, నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేననీ, అధికారంలోకి రాగానే డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా రైతులు, యువతకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. జనగర్జన సభకు అడ్డంకులు సృష్టించేందుకు వారం రోజులుగా బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హజరైయ్యారు.

Maharastra: శరద్ పవార్ కు బిగ్ షాక్ .. తన మద్దతుదారులతో అజిత్ పవార్ తిరుగుబాటు .. డిప్యూటీ సీఎంగా ప్రమాణం

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?