NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు కేసులు మళ్లీ వాయిదా .. విచారణ ఎప్పుడంటే ..

ACB Court and Supreme Court hearing today on Chandrababu's petitions

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న చంద్రబాబుకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ మళ్లీ వాయిదా పడింది. విజయవాడ ఏసీబీ కోర్టులో    ఇవేళ రెండు పిటిషన్లు విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీ విచారణ చేసిన సీఐడీ అధికారులు తమకు విచారణ లో చంద్రబాబు సహకరించలేదనీ, మరో అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీ పొడింపుతో పాటు చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ పైనా ఒకే సారి వాదనలు విని ఆర్డర్స్ ఇస్తామని నిన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. తొలుత తమ పిటిషన్ విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు, ముందుగా కస్టడీ పిటిషన్ పై విచారణ జరపాలని సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న వాదోపవాదనలు చేశారు.

ACB Court and Supreme Court hearing today on Chandrababu's petitions
ACB Court and Supreme Court hearing tomorrow on Chandrababu’s petition

అయితే రూల్స్ ప్రకారం పిటిషన్ లపై విచారణ జరుపుతామని న్యాయమూర్తి నేటికి (మంగళవారం) విచారణను వాయిదా వేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఒక రోజు సెలవు పై వెళ్లారు. దీంతో ఏసీబీ కోర్టు ఇంఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి గా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారించాలని ఇన్ చార్జి న్యాయమూర్తిని కోరారు. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‍లో చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఇన్ చార్జి జడ్జి విచారణను రేపటికి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్‍పై ఇవాళ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా, ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమనీ తాను రేపటి నుంచి సెలవుపై వెళ్లనున్నట్లు ఇన్ చార్జి న్యాయమూర్తి తెలిపారు. రేపు రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని ఇరుపక్షాలకు సూచించిన ఏసీబీ కోర్టు ఇన్ చార్జి న్యాయమూర్తి.. విచారణను రేపటికి వాయిదా వేశారు.

chandrababu reaction about CID comments
chandrababu

మరో పక్క చంద్రబాబు తరపున సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) బుధవారం విచారణకు రానుంది. చంద్రబాబు తరపున దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడి కానున్నది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ కింద గవర్నర్ నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదు చేసి కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్ పై న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా నిన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించగా, ఇవేళ మెన్షన్ లిస్ట్ తో రావాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేళ సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ లిస్ట్ అవకాశం లేకపోవడంతో,  నేరుగా మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్నారు. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఎల్లుండి నుండి అక్టోబర్ 2 వరకూ సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు రిలీఫ్ లభిస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

YS Sharmila: కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల అల్టిమేటం..? .. విలీనం లేకపోతే 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ..

Related posts

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?