NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 25 2023 Episode 108: స్వరని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న చందన..

Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights

Paluke Bangaramayenaa December 25 2023 Episode 108: ఐ హేట్ యు స్వరా నువ్వంటే నాకు చాలా అసహ్యం నిన్ను నా జీవితంలో ఎప్పటికీ క్షమించను అని అభిషేక్ అంటాడు. స్వర ఆ మాటలన్నీ వినుకుంటూ భరిస్తూ ఏడుస్తూ తనని లోపలికి తీసుకువెళ్లి గదిలో పడుకోబెడుతుంది. అలా వస్తూ ఉండగా కాళ్ళకి చెప్పులు కనిపిస్తాయి ఆ చెప్పులు తీస్తూ ఉండగా అభిషేక్ చెయ్యి తాకి టేబుల్ మీద ఉన్న సామాన్లు కింద పడిపోతాయి. కట్ చేస్తే, ఇంట్లో వాళ్ళందరూ ఏమైందని గబగబా అభి రూమ్ లోకి పరిగెత్తుకొస్తారు. వచ్చేసరికి అక్కడ స్వర కనిపిస్తుంది స్వర ఎంత ధైర్యం నీకు మా అన్న ఇంట్లోకి రావద్దన్న గాని ఎందుకు వచ్చావు ఇంకా ఏమి చేయాలని వచ్చావు ఇంకా నిందలు వేయడానికి ఇంకేమైనా మిగిలిపోయాయి అని చందన అంటుంది. లేదండి నేను ఊరికే ఏమీ రాలేదు అభి సార్ తాగి కింద పడిపోయాడు తనను తీసుకువచ్చి పడుకో పెడుతున్నాను అని స్వర అంటుంది. తీసుకొచ్చి పడుకో పెట్టాలనుకున్నావో తన రూమ్లో శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నావో ఎవడికి తెలుసు నీలాంటి దానికి ఎన్ని చెప్పినా బుద్దే ఉండదు అయినా అభిషేక్ తాగి వస్తే మమ్మల్ని పిలవాలి గాని నువ్వెలా లోపలికి తీసుకొస్తావు అంటే అభి చెప్పిన మాటలు నీకు ఏమీ గౌరవం లేదా నువ్వు అసలు మనిషివే కాదు పశువు కన్నా హీనంగా ఉన్నావు ఏం చేయడానికైనా వెనక ముందు ఆడట్లేదు అని చందన వాళ్ళ ఆయన అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights

నేను చెప్తున్నది నిజం అండి అభి సార్ తాగి  అక్కడ పడిపోయి ఉన్నాడు నేను తనని తీసుకువచ్చి గదిలో పడుకోబెట్టాను అంతే ఇంకేమీ చేయలేదు అని స్వరా అంటుంది. ఐ మిస్ యు ఝాన్సీ ఆ స్వర వల్లనే నువ్వు పోగొట్టుకున్నాను నా ఉద్యోగం కూడా పోయింది అని అభిషేకం కలవరిస్తూ ఉంటాడు.ఇంకా ఏం మిగిలిందే నా కొడుకుని నాశనం చేశావు ఝాన్సీ ని పొట్టన పెట్టుకున్నావ్ నిన్ను తోడబుట్టిన దాని కంటే ఎక్కువ చూసుకుంది కదే ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు అని యశోద అంటుంది. పాపం స్వర చేయని తప్పుకి నిందలు భరిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని కీర్తి అనుకుంటుంది. చూడు స్వర నువ్వు తప్పు చేసావా లేదా అనేది పక్కన పెడితే అభికి నిన్ను చూస్తే నచ్చట్లేదు నువ్వు కాస్త వాడికి దూరంగా ఉండడం మంచిదమ్మా అని వాళ్ళ బామ్మ  అంటుంది. దీనికి మాటలతో చెప్తే ఎందుకు వింటుంది బామ్మ అని చందన స్వర మేడపట్టి లాక్కొచ్చి బయటికి గెంటేస్తుంది.

Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights

కట్ చేస్తే, నీకు నీకు బుద్ధి జ్ఞానం చీము నెత్తురు ఏ మాత్రం ఉన్నా సరే నువ్వు ఇంకోసారి లోపలికి వచ్చే ప్రయత్నం చేయవు నువ్వు మనిషివని అనుకుంటున్నాను మాటమీద నిలబడు ఇక్కడే ఉండమని మా అన్నయ్య చెప్పాడు ఇకనుంచి ఇంకోసారి లోపలికి వచ్చే ప్రయత్నం చేసావు నేనే నిన్ను చంపేస్తాను అని చందన అంటుంది.స్వరనీ అలా అంటుంటే కీర్తి నిలబడి చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో బాధపడుతూ ఉంటుంది. స్వర బయట కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు రా కీర్తి తనకు సహాయం చేస్తే బాగోదు అంటూ చందన కీర్తిని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అభి ఫుల్లుగా తాగి ఉండడంతో ఏమి సోయ లేకుండా కలవరిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అభిషేక్ కి మజ్జిగ తాగిపిస్తుంది అలా మజ్జిగ తాపేయడంతో వాంతులు చేసుకుంటాడు అభిషేక్ యశోద కొన్ని మంచిని తీసుకురా మొహం తుడుద్దాం అని వాళ్ళ అత్తయ్య అంటుంది. వాళ్ల బామ్మ మొఖం మీద నీళ్లు చల్లి మొహం తుడిచి యశోద నువ్వు విని కూర్చోబెట్టు అన్నం తినిపిద్దాము అని అంటుంది. యశోద అభిషేక్ ని లేపి కాస్తంత మెత్తలు వేసి పైకి కూర్చోబెట్టి నాన్న అభి ఒక ముద్ద తిను ఏంట్రా నేను నిన్ను ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతుంది యశోద.

Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights

అంత ఆ స్వర వల్లే నేను అమ్మ నా ఝాన్సీ చనిపోయిందని తట్టుకోలేక తాగానమ్మ నా జీవితంలో ఆ స్మరణ క్షమించనమ్మ ఝాన్సీ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మామా ఝాన్సీ ని మర్చిపోలేక పోతున్నాను మందు తాగితే నైనా కాస్తంత సేపు ఝాన్సీ ని మర్చిపోవచ్చని తాగాను కానీ మర్చిపోలేక పోతున్నాను తనంటే ఎంత ఇష్టమో చెప్పలేనమ్మ అని అభిషేక్ బాధపడతాడు. రేయ్ అభిషేక్ నిన్ను ఈ పరిస్థితుల్లో చూసా తట్టుకోవడానికారా మేము ఇంకా బ్రతికి ఉన్నది మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే మేమేం అయిపోవాలి రా అని వాళ్ళ బామ్మ అంటుంది. ఏం చేయమంటావ్ బొమ్మ ఝాన్సీ లేకపోవడంతో నాకు అంత శూన్యమే కనిపిస్తుంది శూన్యం లాగే ఝాన్సీ కూడా ఎప్పటికీ కనిపించదు కదా నాయనమ్మ అని అభిషేక్ ఏడుస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights

కట్ చేస్తే, సార్ నేనే ఇంత బాధపడుతున్నాను ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే ఇంక మీ అమ్మ వాళ్లు తట్టుకోలేరు సార్ ఎందుకు మీరు ఇలా తాగారు తప్పు నాదే క్షమించండి సార్ నీకు చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను ఝాన్సీ మేడానికి ఇలా అవుతుందని నేను అనుకోలేదు సార్ అనే పశ్చాత్తాపంతో ఏడుస్తుంది స్వర. అభిషేక్ వాళ్ళమ్మ అటూ ఇటూ నచ్చజెప్పి అన్నం తినిపించి అభిషేకిని పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారిందిలేచి చూసేసరికి స్వరకి బయట అంతా ఎండగా కనిపిస్తుంది. ఇంతలో కీర్తి వచ్చి స్వర వెళ్లి ఈ డ్రెస్ వేసుకొని రా అని అంటుంది. స్వర వెళ్లి ఆ డ్రెస్ వేసుకొని వచ్చి వచ్చేసరికి ఝాన్సీ మేడం స్కూటీ చూడగానే దుఃఖం పొంగు కొచ్చి  నన్ను క్షమించండి అవిశాల్ మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి నా చేత అబద్ధం సాక్ష్యం చెప్పించుకున్నాడు

Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 25 2023 Episode 108 Highlights

అభిషేక్ సార్ నిజంగానే నేను విశాల్ ని కాపాడడానికి సాక్ష్యం చెప్పానని నమ్ముతున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి కృష్ణయ్య అమ్మను పిన్ని చంపిందని ఆ విషయాలు సహాయం చేశాడని ఎలాగైనా సరే అభిషేక్ సార్ కి చెప్పాలి సార్ తో చెప్పే ధైర్యం నాకు ఇవ్వు కృష్ణయ్య అని స్వర అంటుంది. మళ్లీ వెళ్లి తన బెడ్ షీట్లు మార్చేస్తూ ఉండగా ఇంతలో ఆర్య నీలకంఠం అక్కడికి వస్తారు. స్వరని ఆ పరిస్థితుల్లో చూసిన ఆర్ ఆర్య అయిపోతాడు. సుర వాళ్ళని చూసుకోకుండా బెడ్ షీట్లు మార్చేసి కూర్చోలే వేసి వెనుకకు తిరిగేసరికి వాళ్ళిద్దరూ కనపడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri