Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ఒక శిఖరం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైట్స్ పరంగా డాన్స్ పరంగా ఒక కొత్త ఒరవడిని చిరంజీవి తీసుకొచ్చారు. హీరోయిజానికి మారుపేరుగా నిలిచారు. టాలీవుడ్ సింహాసనాన్ని దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిరంజీవి ఏలడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నెంబర్ వన్ హీరోగా చిరంజీవి రాణించారు. చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో ఇప్పటివరకు ఎవరూ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో యంగ్ జనరేషన్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. అయితే ఎలాంటి సినిమా అయినా గాని ఎన్ని కోట్లతో నిర్మించిన గాని మహా అయితే 20 రోజులు మించి థియేటర్లో కనపడటం లేదు.
20 రోజులలోనే కొన్ని వందల కోట్లు కలెక్షన్ లు వస్తున్నాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే వారం రోజులకే ఎత్తేస్తున్నారు. ఆ రకంగా బయట ప్రపంచం…గతంలో కంటే ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉంది. ఇటువంటి రోజులలో గత ఏడాది సంక్రాంతి పండుగకు చిరంజీవి మరియు రవితేజ కలిసి నటించిన “వాల్తేరు వీరయ్య” విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చిరంజీవి తమ్ముడు పాత్రలో రవితేజ పవర్ఫుల్ రోల్ లో కనిపించారు. గతంలో “అన్నయ్య” సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో నటించిన రవితేజ చాలా కాలం తర్వాత “వాల్తేరు వీరయ్య”లో మళ్లీ చిరంజీవికి తమ్ముడు పాత్ర చేయడం జరిగింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం అని వర్గాల ప్రేక్షకులను అలరించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కృష్ణ జిల్లా అవనిగడ్డలో రామకృష్ణ థియేటర్ లో 365 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలాంటి రోజులలో కనీసం వంద రోజులు యాభై రోజులు కూడా కనిపించని పరిస్థితులు నెలకొన్న ఇండస్ట్రీలో 365 రోజులు చిరంజీవి సినిమా ఆడటం సంచలనం సృష్టించింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఓ వాయిస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. “ఈ రోజులలో ఇది ఎవరు టచ్ చేయలేని రికార్డ్. దీనికి కారణం మీకు నచ్చేలా సినిమాను మలిచిన డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్, నా తమ్ముడు రవితేజతో పాటు ఇతర నటులది”.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చిరంజీవి తన అభినందనలు తెలియజేయడం జరిగింది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!