NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mudragada Padmanabham: ముద్రగడ మదిలో ఏముంది ..?

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఆయనను వైసీపీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇవ్వడానికి వైసీపీ సిద్దమైంది. ఆయన కోరితే కాకినాడ ఎంపీ స్థానంతో పాటు ఆయన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ సుముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

రీసెంట్ గా నూతన సంవత్సర వేడుకలను కిర్లంపూడి లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అదే రోజు ఆయన కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ వాయిదా పడింది. టీడీపీ, జనసేన కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతుండటంతో వైసీపీ లో చేరిక ఖాయమని అందరూ భావిస్తున్నారు. మొన్నటి వరకూ ఆయన నివాసానికి వైసీపీ ముఖ్యనేతలు క్యూకట్టి చర్చలు జరిపారు.

తాజాగా జనసేన, టీడీపీ నేతలు ముద్రగడతో భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ముద్రగడతో కలిసి తమతో కలిసి రావాలని కోరారుట, కాపు పెద్దలంతా ఈ సారి కలిసికట్టుగా పని చేయాలని పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ఆయనకు అందించారు. తాజాగా ఈరోజు ముద్రగడ ఇంటికి టీడీపీ నేతలు క్యూకట్టారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పని చేయాలని ఆయనకు చెప్పనున్నారు. టీడీపీ – జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆయనను కోరనున్నారు.

ఒక పక్క వైసీపీ, మరో పక్క టీడీపీ – జనసేన నేతలు ముద్రగడతో సమాలోచనలు జరుపుతుండటంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ ఇంట జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన అభిమానులు మాత్రం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటా తామంతా మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే టీడీపీ, చంద్రబాబు వ్యతిరేక భావజాలంతో ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేనకు ఎలా మద్దతు ఇస్తారు అనేదే పెద్ద ప్రశ్నగా ఉంది. ఆత్మీయ సమావేశం నిర్వహించి పది రోజులు దాటుతున్నా ముద్రగడ ఏమి తేల్చకపోవడంతో ఆయన మదిలో ఏముంది అని ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరో పక్క సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.  టీడీపీ – జనసేన పొత్తు ఖరారు  అయిన నేపథ్యంలోనే అభ్యర్ధుల ఎంపికలో స్ట్రాటజీ మార్చేశారు. బీసీ కార్డు ఉపయోగిస్తున్నారు. ఎక్కువ శాతం టికెట్ లు బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే ఇన్ చార్జిలు, సిట్టింగ్ ల మార్పులు చేర్పులు చేస్తున్నారు. గతంలో కంటే ఈ సారి ఎక్కువ మంది బీసీ నేతలకు టికెట్ లు ఇచ్చి ఆ వర్గాన్ని మరింత దగ్గర చేసుకునే పనిలో వైసీపీ ఉంది.

YSRCP: నేడు 30 మందితో మూడో జాబితా విడుదల ..! ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అభ్యర్ధులు వీరే..?

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju