NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడు 30 మందితో మూడో జాబితా విడుదల ..! ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అభ్యర్ధులు వీరే..?

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లో మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్పులు, చేర్పులు చేపట్టినట్లుగా తెలుస్తొంది. అయితే మూడో జాబితాలో మొత్తం 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరించినట్లు సమాచారం.

వాస్తవానికి నిన్న రాత్రే మూడో లిస్ట్ ను విడుదల చేయాల్సి ఉన్నా రెండు మూడు నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ రాకపోవడం, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు మున్సిపల్ కార్మిక సంఘాలతో సమ్మె విరమణపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మూడో లిస్ట్ ప్రకటన వాయిదా వేశారని తెలుస్తొంది. తొలి జాబితాలో 11, రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయగా, తాజాగా 30 నియోజకవర్గాలకు ఇవేళ ఇన్ చార్జిలను ప్రకటించనున్నది వైసీపీ.

YSRCP CM YS Jagan

నియోజకవర్గాల వారీగా రాజమండ్రి (ఎంపీ) – సిటీ డైరెక్టర్ వీవీ వినాయక్, కర్నూల్ (ఎంపీ) – గుమ్మనూరు జయరాం, విశాఖ (ఎంపీ) బొత్స జాన్సీరాణి, విజయనగరం (ఎంపీ) – మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి (ఎంపీ) – అడారీ రమాదేవి, నెల్లూరు (ఎంపీ) వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి  పేర్లు దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తొంది. అలానే విజయవాడ లోక్ సభ స్థానానికి టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానికి ఖరారు చేసినప్పటికీ ఇంకా అధికారికంగా పార్టీలో చేరనందున ఈ జాబితాలో ప్రకటన చేయడం లేదని సమాచారం.

అసెంబ్లీ ఇన్ చార్జిల విషయానికి వస్తే చింతలపూడి నియోజకవర్గ ఇన్ చార్జిగా విజయరాజు, మడకశిరకి పోలీస్ అధికారి శుభకుమార్, గూడురు నియోజకవర్గానికి మేరుగ మురళి, దర్శిక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాయదుర్గానికి మెట్టు గోవిందరెడ్డి, చిత్తూరుకు విజయానంద రెడ్డి, ఆలూరుకు విరూపాక్ష, నందికొట్కూర్ కు గంగాధర, మార్కాపురంకు జంకె వెంకట్ రెడ్డి, పెందుర్తి ఇన్ చార్జిగా ఆదుర్తి రాజు, గంగాధర నెల్లూరుకు కృపాలక్ష్మి లను ఇన్ చార్జిలుగా నియమించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే అధికారికంగా ఇవేళ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవేళ మూడో జాబితాను ప్రకటించనున్నారని సమాచారం. మూడో జాబితాలో ఒకటి రెండు చోట్ల మార్పులు చేర్పులు ఉండవచ్చని అనుకుంటున్నారు.

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju