NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

Pawan Kalyan – Ambati Rayudu: వైసీపీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రజాసేవ చేసేందుకు రాజకీయ అరంగ్రేటం చేసిన అంబటి తిరుపతి రాయుడు పది రోజుల వ్యవధిలోనే వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత కొంత కాలంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సేవా కార్యక్రమాలకు కొంత ఖర్చు పెట్టారు. గత నెల 28వ తేదీ వైఎస్ జగన్ ను కలిసి పార్టీ కండువా కప్పుకోవడంతో ఇక రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుండి పోటీ చేస్తారని అందరూ భావించారు.

అయితే ఆకస్మికంగా వైసీపీని వీడుతున్నట్లుగా ఈ నెల 6వ తేదీన ప్రకటించారు. ఈ ఆకస్మిక నిర్ణయంతో అనేక రకాలుగా వదంతులు వచ్చాయి. దీంతో ఆ మరుసటి రోజే వైసీపీని వీడటానికి గల కారణాన్ని కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అంబటి రాయుడు. క్రికెట్ ఆడటం కసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. త్వరలో దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ టీ 20 లీగ్ లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని వెల్లడించారు. అయితే అనూహ్యంగా బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నారని, జనసేనలో చేరేందుకే పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరో పక్క జనసైనికులు, పవన్ అభిమానులు సంతోషం కూడా వ్యక్తం చేశారు. అంబటి రాయుడు జనసేనలో చేరతారని ఆశపడ్డారు. అయితే వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేలా ప్రకటన చేశారు అంబటి రాయుడు. పవన్ తో జరిగిన సమావేశం వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ద్వారా రాయుడు వెల్లడించారు. తాను స్వచ్చమైన ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన ఆశయాలు నెరవేర్చడానికి తాను వైసీపీలో చేరానని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే .. తాను చాలా  గ్రామాల్లో సామాజిక సేవ చేశానన్నారు. అయితే..కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ సీపీతో కలిసి ముందుకు వెళితే ..తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని అర్ధమయ్యిందన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టడం లేదని అన్నారు. తన భావజాలం, వైసీపీ సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో ఫలనా స్థానం నుండి పోటీ చేయాలని అనుకోలేదని అన్నారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నాననీ, అయితే..నిర్ణయం తీసుకునే ముందు ఒక సారి పవన్ అన్నను కలవమని స్నేహితులు, శ్రేయోభిషాషులు సలహా ఇచ్చారనీ, పవన్ సిద్ధాంతాల గురించి తెలుసుకోమన్నారన్నారు. అందుకే పవన్ ను కలిసి మాట్లాడటం జరిగిందన్నారు.

Ambati Rayudu

జీవితం, రాజకీయాలతో పాటు అయన్ను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించానని, మా ఇద్దరి ఆలోచనల్లో సారుప్యత కనిపించిందన్నారు. పవన్ ను కలిసినందుకు చాలా హాపీగా ఉందన్నారు. ప్రస్తుతానికి తన క్రికెట్ కమిట్ మెంట్ ల కోసం తాను త్వరలో దుబాయ్ బయలుదేరతానని, తాను ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటానని అంబటి రాయుడు పేర్కొన్నారు. కాగా, అంబటి రాయుడుకి పవన్ కళ్యాణ్ వెండి వినాయకుడి ప్రతిమను బహుకరించారు.

Kesineni Nani: ఎంపీ పదవికి, టీడీపీకి కేశినేని నాని రాజీనామా.. ఈమెయిల్ ద్వారా స్పీకర్ కు రాజీనామా లేఖ

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju