Naa Saami Ranga: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నాగార్జున నటించిన “నా సామిరంగ” జనవరి 14వ తారీకు విడుదల కాబోతోంది. శ్రీనివాస చిత్తూరు నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. జనవరి 10 బుధవారం హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రను పోషించడం జరిగింది. సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మెలోడీ సాంగ్ రిలీజ్ కావటం జరిగింది.
“ఇంకా ఇంకా” అంటూ సాగే ఈ సాంగ్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ అదే విధంగా కొన్ని సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాగార్జున సరసన ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున సంచలన స్పీచ్ ఇచ్చారు. సంక్రాంతి పండుగకు వస్తున్న నాలుగు సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇండస్ట్రీలో మహేష్ బాబు అడుగుపెట్టి 25 సంవత్సరాలు అయింది. ఈ క్రమంలో వస్తున్న గుంటూరు కారం కి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా బాల నటుడిగా మెప్పించి “హనుమాన్” తో హీరోగా పరిచయం అవుతున్న తేజ సజ్జాకి కూడా ఆల్ ది బెస్ట్, మా వెంకీ సినీ కెరియర్ లో 75వ సినిమాగా రిలీజ్ కాబోతున్న “సైంధవ”కి కూడా విషెస్ తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ఇక “నా సామిరంగ” సినిమా విషయానికొస్తే… నాన్నగారు ఆశీస్సులతో ఈ సినిమా తీయడం జరిగింది. మూడు నెలలలో ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే అందుకోసం ఎంత కష్టపడ్డామన్నది ఇప్పుడు కాదు సక్సెస్ మీట్ లో తెలియజేస్తాను. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారు. పడిన కష్టం గురించి అది ఫలించిన తర్వాత మాట్లాడుకుంటూనే బాగుంటుంది. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ కొడుతున్నాడు అంటూ… నాగార్జున సంచలన స్పీచ్ ఇవ్వటం జరిగింది. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు దాదాపు కొన్ని సంవత్సరాలు నుండి సరైన హిట్టు లేదు. దీంతో “నా సామిరంగ” పై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!