NewsOrbit
Cinema Entertainment News రివ్యూలు సినిమా

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

Naa Saami Ranga review: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండుగ కానుకగా మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. జనవరి 12వ తారీకు హనుమాన్, గుంటూరు కారం విడుదల కావడం జరిగింది. జనవరి 13వ తారీకు వెంకటేష్ నటించిన “సైంధవ్” రిలీజ్ అయింది. ఇక జనవరి 14వ తారీకు నాగార్జున నటించిన “నా సామిరంగ” విడుదల కావడం జరిగింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

చిత్రం: నా సామిరంగ
నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి
కూర్పు: చోటా కె. ప్రసాద్
బ్యానర్స్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: 14 జనవరి 2024

Akkineni Nagarjuna Naa Saami Ranga Movie Review

స్టోరీ:

గోదావరి జిల్లాలో కోనసీమ నేపథ్యంలో సాగే కథ. 1960-80 టైములో… సాగే స్టోరీగా సినిమా స్టార్ట్ అవుద్ది. కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. కోనసీమ జిల్లాలో అంబాజీపేట ఊరిలో కిష్టయ్య ఓ అనాధగా పెరుగుతాడు. అతనిని ఓ తల్లి ఆదరించి పెంచుద్ది. ఆమె చనిపోయాక ఆమె కొడుకు అంజినీ… కిష్టయ్య తమ్ముడు మాదిరిగా స్నేహితుడిలా చూసుకుంటూ ఉంటాడు. కిష్టయ్య అదే గ్రామానికి చెందిన వరాలు(ఆశికా రంగనాథ్) నీ చిన్ననాటి నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. తన 12వ ఏట నుంచే ఆమెతో ప్రేమలో పడతాడు. వరాలు తండ్రి ఊరులో వడ్డీ వ్యాపారి వరదరాజులు (రావు రమేష్). అలా కాలం గడుస్తూ ఉండగా పెద్దయ్యక ఒకరి ప్రేమను మరొకరు చెప్పుకొని పెళ్లికి సిద్ధమవుతూ ఉండగా ఊహించని పరిణామం ఈ ప్రేమ జంటకు ఎదురు అవుద్ది. విషయంలోకి వెళ్తే అదే గ్రామానికి చెందిన భాస్కర్ (రాజ్ తరుణ్) తన ప్రేమ వ్యవహారంతో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. భాస్కర్ నీ కాపాడే బాధ్యత ఊరి పెద్ద కిష్టయ్యకి అప్పగిస్తారు. ఈ క్రమంలో భాస్కర్ విషయంలో కిష్టయ్య ఎదుర్కొన్న సవాలు ఏమిటి..? కిష్టయ్య తన ప్రేమను దక్కించుకోవడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు..? కిష్టయ్య చివర ఆఖరికి తన ప్రేమను దక్కించుకున్నాడా లేదా..? అనేది సినిమా కథ.

Akkineni Nagarjuna Naa Saami Ranga Movie Review

విశ్లేషణ :

“నా సామిరంగ” మొదటి భాగం పర్వాలేదనిపించిన రెండో భాగం సినిమాని ఓ రేంజ్ లో పైకి లేపేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచింది. డైరెక్టర్ విజయ్ బిన్ని సెకండ్ ఆఫ్ లో అల్లరి నరేష్ కి రాసిన సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. నరేష్ ఆల్ రౌండర్ పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ మీద రెచ్చిపోయాడు. యధావిధిగా నాగార్జున ఈ సినిమాలో యంగ్ అండ్ డాషింగ్ గా కనిపించారు. ఫస్టాఫ్ లో సినిమా అలా సాగిపోగా… సెకండ్ ఆఫ్ లో స్టోరీకి విపరీతంగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు పెట్టడం జరిగింది. నాగార్జున మెయిన్ హీరో..అయినా అల్లరి నరేష్ తన యాక్టింగ్ ఎనర్జీ లెవెల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ కథతో దర్శకుడు అద్భుతంగా సినిమాని మలిచాడు. సంక్రాంతి పండుగకి తగ్గట్టు కథ రాసి.. పాత్రలకు తగ్గ నటీనటులను దర్శకుడు తీసుకోవడం విశేషం. సినిమాలో సెకండాఫ్ లో ఆడియోన్స్  ఎంజాయ్ చేసే అనేక సన్నివేశాలు ఉన్నాయి. సినిమాలో నరేష్ మినహా…మిగతా ఆర్టిస్టులు ఎవరు కూడా తమ పరిధి దాటి మెప్పించలేకపోయారు. కొద్దిగా సినిమాలో లవ్ స్టోరీలో సాగదీత సన్నివేశాలు ఉన్నట్టు ప్రేక్షకుడుకి సినిమా చూస్తున్నప్పుడు ఫీల్ కలుపుతోంది. హీరోయిన్ ఆశికా రంగనాథ్.. తన పాత్రకి తగ్గ నటనతో అందంతో మెప్పించింది. టెక్నికల్ పరంగా చూసుకుంటే.. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా మొత్తానికి హైలైట్.

చివరిగా: సంక్రాంతి పండుగ తగ్గట్టు అక్కినేని నాగార్జున “నా సామిరంగ”తో మాస్ హిట్ అందుకున్నాడని చెప్పవచ్చు.

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri