NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: బీఆర్ఎస్ బిషాణ ఎత్తేసినట్లే(గా)..?

KCR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) బిషాణ ఎత్తేసినట్లే కనబడుతోంది. ఇక్కడి ఆ పార్టీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఏడాది కింద ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించారు.

KCR

తెలంగాణలో కుమారుడు కేటిఆర్ కు పట్టాభిషేకం చేసి తాను జాతీయ రాజకీయాల్లో స్టీరింగ్ తిప్పాలనుకున్నారు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధినేత కేసిఆర్. ఆ క్రమంలోనే ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చేశారు.

బీఆర్ఎస్ ను ముందుగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ విస్తరించాలని భావించారు గులాబి అధిపతి కేసిఆర్. కర్ణాటకలో కేసిఆర్ నమ్ముకున్న కుమార స్వామి హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణ బ్రేక్ పడింది. మహారాష్ట్ర లో నాందేడ్ తదితర జిల్లాలో బీఆర్ఎస్ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కేసిఆర్. పలు మార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు.

మరో పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను ఏపీ అధ్యక్షుడుగా నియమించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారధి సహా ఏపీలోని పలు జిల్లాల నుండి గత ఏడాది జనవరి 2న పలువురు నేతలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. కేసిఆర్ వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు ఆ నేతల చేరికల సందర్భంగా కేసిఆర్ ప్రకటించారు. అయితే ఏడాది తిరగకముందే కేసిఆర్ అంచనాలు తారు మారు అయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో ఏపీలోని ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీతో టచ్ లోకి వెళ్లారు.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించినా, ఆయన ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లిన కేసిఆర్ .. ఏపీలో పార్టీ ప్రారంభోత్సవానికి మాత్రం హజరు కాలేదు.

గత ఏడాది ఆగస్టు నుండి పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిమగ్నమై ఉండటంతో ఏపీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఏపీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైలెంట్ అయిపోయారు. పార్టీ ముఖ్యనేతలే సైలెంట్ అవ్వడం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పర్యటించే పరిస్థితి లేకపోవడంతో ఏపీలో జెండా పీకేసినట్లేనని భావిస్తున్నారు. ఆ పార్టీలో చేరిన నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు.

Ayodhya Ram Mandir Pratishtha: అయోధ్యలో సందడే సందడి .. ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju