Tollywood director: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరి ఫొటోస్ సోషల్ మీడియా లో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో అమ్మాయి ఫోటో బయటకొచ్చింది. ఆమె తండ్రి ఓ స్టార్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ పేరు ఎవ్వర్నీ అడిగినా ఇట్టే చెప్పేస్తారట. అంతటి పాపులారిటీ ఉన్న డైరెక్టర్ కూతురే పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ.
మరి ఈమె ఎవరు? ఏ డైరెక్టర్ కూతురు? అనేది ఇంకా మీకు తెలియలేదా? అదేనండి పుష్ప సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్న సుకుమార్ తనయురాలు పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి. ఈ అమ్మాయి పేరు సుకృతి వేణి. తాజాగా ఈమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు సుకుమార్ ఫ్యామిలీ.
ఈ నేపథ్యంలోనే సుకుమార్ భార్య తబిత కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక ఈమె సడన్ గా కనిపించేటప్పటికి ఎవరు గుర్తుపట్టలేకపోయారు.
ఎందుకంటే గతంలో రెండు మూడు సార్లు కనిపించినప్పటికీ అప్పుడు చాలా చిన్నపిల్ల లాగా కనిపించింది. కానీ ప్రస్తుతం మాత్రం చాలా గ్లామరస్ గా కనిపించింది. దీంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఈమె కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.