NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు భద్రత పెంపు

YS Sharmila:  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన అన్న జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Security Increased for ap pcc President YS Sharmila in Kadapa District

జగనన్నా, జగనన్నా అంటూనే ..

జగనన్నా, జగనన్నా అంటూనే ప్రభుత్వ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. షర్మిల జిల్లా పర్యటనల్లోనూ భారీగా జనాలు వస్తున్నారు. వైఎస్ జగన్ పై షర్మిల విమర్శలు చేస్తుంటే, వైసీపీ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

సెక్యురిటపై డీజీపీకి లేఖ

మరో పక్క గతంలో ఆమెకు సెక్యురిటీగా 4+4  సెక్యురిటీ సిబ్బంది ఉండగా, తొలుత 2+2 ఆ తర్వాత 1+1కు కుదించారు. సెక్యురిటీ తగ్గించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తనకు భద్రతా సిబ్బందిని పెంచాలని కోరుతూ షర్మిల డీజీపీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా డీజీపీకి లేఖ రాశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో ఇటీవల వైఎస్ షర్మిల తీవ్ర  ఆవేదన వ్యక్తం చేశారు.

నా చెడు కోరుతున్నట్లే కదా..

ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదంటే తనకు చెడు కోరుకున్నట్లే కదా అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భద్రత పెంపు కోరుతూ పోలీసులకు ధరఖాస్తు చేసుకోవాలని ఆమెకు పోలీసు వర్గాలు సూచించినట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆమె అధికారికంగా కోరడంతో వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

సెక్యురిటీ 2+2కు పెంపు

వైఎస్ షర్మిల అభ్యర్ధన మేరకు ప్రస్తుతం ఉన్న 1 +1 నుండి 2+2 భద్రత పెంచామని తెలిపారు. షర్మిల అభ్యర్ధన మేరకు డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లుగా జిల్లా ఎస్పీ వెల్లడించారు.  భద్రతా ప్రమాణాల నిబంధనల మేరకు ఇలా పెంచినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లు కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫార్సు (సెక్యురిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయిస్తామని ఎస్పీ వెల్లడించారు.

TDP Janasena: గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్ధులు వీరే..?

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju