NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు అధికారికంగా రాజీనామా చేశారు. లోక్ సభలో రఘురామ కృష్ణరాజు సాంకేతికంగా వైసీపీ సభ్యుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ హైకమాండ్ సుమారు నాలుగేళ్లుగా దూరంగా పెట్టింది. గత ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామ కృష్ణరాజు .. కొద్ది కాలానికే రెబల్ ఎంపిగా మారారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ పేరుతో మీడియా సమావేశాలు పెడుతూ వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు రఘురామ.

ఈ క్రమంలోనే రఘురామ కృష్ణరాజుపై అనర్హత పిటిషన్ కూడా దాఖలైంది. రఘురామ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత పలు పర్యాయాలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు. మరో పక్క ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, విమర్శలపైనా గతంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఓ కేసులో అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే. అలానే పలు పోలీస్ స్టేషన్ లోనూ రఘురామపై వైసీపీ శ్రేణుల ఫిర్యాదుతో కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రానికి వస్తే తనను అరెస్టు చేస్తారన్న భయంలో రఘురామ నరసాపురం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఎక్కువ రోజులు ఢిల్లీ, హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.

కాగా, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో  రఘురామ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ సభ్యత్వం నుండి తనను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రాధమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాననీ, వెంటనే ఆమోదించాలని కోరారు. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. నరసాపురంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని అందులో పేర్కొన్నారు.

Medaram Maha Jatara: నేడు వనంలోకి దేవతలు

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?