NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ ఓపెన్ అయిపోకు… జ‌ర జాగ్ర‌త్త అవ‌స‌రం బ్రో…!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ఓపెన్ అయిపోతున్నారా? వైసీపీ నాయ‌కుల వ్య‌వ హారంలో ఆయ‌న మ‌న‌సులో ఏమీ దాచుకోకుండా.. బ‌య‌ట‌కు చెప్పేస్తున్నారా. అంటే.. ఔన‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. త‌న ద‌గ్గ‌ర రెడ్‌బుక్ ఉంద‌ని.. అంద‌రి పేర్లూ ఇందులో రాసుకున్నాన‌ని.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ పుస్త‌కంలో ఏర్లు ఉన్న‌వారిని ఎలా ట్రీట్ చేయాలో అలానే చేస్తామ‌ని చెప్పారు. ఒక్క పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హార‌మే కాదు.. ఐఏఎస్‌, ఐపీఎస్ ల పేర్లును కూడా ఆయ‌న చెప్పేస్తున్నారు.

క‌లెక్ట‌ర్ వేణు(పూర్తిపేరు కాదు), ఐపీఎస్ రెడ్డిల పేర్లు త‌న ద‌గ్గర ఉన్నాయ‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చా క‌.. వారికి ప‌నిష్మెంట్‌త‌ప్ప‌ద‌ని నారా లోకేష్ అంటున్నారు. ఇక‌, వైసీపీ నాయ‌కుల పేర్లు కూడా ఇదే పం థాలో చెబుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి, అర‌గంట‌, గంట మంత్రులు.. బొక్కుడు బొత్స‌.. ఇలా.. కొంద‌రి పేర్లు కూడా ఆయ‌న చెబుతున్నారు. అయితే.. రాజ‌కీయంగా మ‌న‌సులో ప్ర‌త్య‌ర్తుల‌పైనా.. అధికారుల‌పైనా ఎంత క‌సి ఉన్నా.. బ‌య‌ట‌కు మాత్రం చెప్ప‌కూడ‌ద‌నేది చిన్న లాజిక్‌.

ఉదాహ‌ర‌ణ‌కు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్ చేశారు. దీనికి టీడీపీ నేత‌లు ప్ర‌ధాన కార‌ణం కాద‌ని.. ఓ కీల‌క ఐపీఎస్ కార‌ణ‌మ‌ని గుర్తించిన వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత జ‌గ‌న్ ఈ విష‌యాన్ని ఎక్క‌డా బ‌య‌ట‌కు చెప్పలేదు. కానీ, తాను అధికారంలోకి స‌ద‌రు ఐపీఎస్‌కు చుక్క‌లు చూపించారు ఇప్ప‌టికీ ఆయ‌న ఉద్యోగం లేక‌.. ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అదేవిధంగా ఓ కీల‌క ఐఏఎస్ వ్య‌వ‌హారంలోనూ ఇలానే చేశారు.

ఇది.. ఏ నాయ‌కుడు అయినా.. చేయాల్సిన ప‌ని. అలా కాకుండా.. అంతా ముందే బ‌య‌ట ప‌డితే.. ము ఖ్యంగా ఎన్నిక‌ల‌కుముందుగానే.. మేం రాగానే చుక్క‌లు చూపిస్తాం అని చెప్పుకొంటూ.. పోతే.. వ్య‌తిరేక శ‌క్తులు ఏక‌మ‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంటుంది. తెలంగాణ‌లోనూ ఇదే జ‌రిగింది.. మేం అధికారంలోకి వ‌స్తే.. కేసీఆర్‌ను బొక్క‌లే వేస్తాం అన్న బీజేపీని ప్ర‌జలు ప‌ట్టించుకోలేదు. ఇదే స‌మ‌యంలో మేం అధికారంలోకి వ‌స్తే.. కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన త‌ప్పులు స‌రిచేస్తామ‌న్న రేవంత్ వాద‌న‌వైపు నిలిచారు. ఇలాంటి వ్యూహాలే ఫలిస్తాయ‌ని.. నారా లోకేష్ కొంత జాగ్ర‌త్త ప‌డాల‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!