Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుని తన సత్తా చాటుకున్న వైష్ణవి చైతన్య మనందరికీ సుపరిచితమే. బేబీ సినిమాలో ఈమె నటనకి మరియు అభినయానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సినిమాలో నటించినది బాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ బయట ఈమె ప్రవర్తన చూసి ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య కి అనేక సినిమా ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎక్కడో యూట్యూబ్ లో చిన్నచిన్న వెబ్ సిరీస్ చేసుకుంటూ జీవితాన్ని సాగించే వైష్ణవి చైతన్య ప్రస్తుతం హీరోయిన్ అయిపోవడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.
యూట్యూబర్ షణ్ముఖ్ తో నటించిన ఈమె వెబ్ సిరీస్ మామూలు పాపులారిటీ దక్కించుకోలేదు. సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి వెబ్ సిరీస్లో ఈమె యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్ చూసే సాయి రాజేష్ కూడా తన సినిమాలో వైష్ణవి అయితే కరెక్ట్ గా ఉంటుందని ఆమెని అప్రోచ్ అయ్యాడట. దీంతో ఆమెకి సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో ఆమె కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యిందట. వైష్ణవి చైతన్య బేబీ సినిమా కంటే ముందే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ హీరోయిన్ గా కాదు. ఒక చెల్లి మరియు ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ వెండితెరపై మెరిసింది.
అయినప్పటికీ ఈమెకి పెద్ద పాపులారిటీ దక్కలేదు. కానీ అలా బేబీ సినిమాలో నటించిందో లేదో ఇలా లక్షల మంది ఫాలోవర్స్ సోషల్ మీడియా మధ్యమాలలో చేరారు. ఈ బేబీ సినిమా రీమిక్స్ వరకు వెళ్ళిందంటే ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హ్యాట్రిక్ హిట్ తో ఉన్న వైష్ణవి చైతన్య కి లవ్ మీ అనే ఒక సినిమా అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా లవ్ మీ అనే ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాని అఫీషియల్ గా నిన్ననే వెల్లడించారు. ప్రస్తుతం ఈ టైటిల్ లాంచ్ లో వైష్ణవి చైతన్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చాలా సింపుల్ లుక్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.
బ్లూ కలర్ కాటన్ డ్రెస్ ని ధరించిన వైష్ణవి చైతన్య తన ఒంపు సొంపులతో హృదయాలను గలుచుకుంది. ఇక ప్రస్తుతం వైష్ణవి చైతన్య ధరించిన డ్రెస్ రేట్ పై చర్చలు జరుగుతున్నాయి. ఈమె ఇండస్ట్రీకి రాకముందు కాస్ట్లీ డ్రెస్సెస్ పెద్దగా ధరించేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం కాస్ట్లీ డ్రెస్సెస్ మాత్రమే ధరిస్తుంది. ఇక లవ్ మీ టైటిల్ లాంచ్ లో ఈ ముద్దుగుమ్మ ధరించిన డ్రెస్ ధర అక్షరాల ఒక రూ. 5000 వరకు ఉండనున్నట్లు తెలుస్తుంది. కొందరు ఈమె డ్రెస్ ధర చూసి షాక్ అవుతుంటే మరి కొందరు ఇది కామన్ అని వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ చెక్కర్లు కొడుతున్నాయి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!