Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికలలో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ అధినేతగా ఎన్నికల ప్రచారంలో పర్యటనలు చేపడుతున్నారు. 2024 ఎన్నికలలో గెలవాలని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి చెందటంతో ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో సినిమా షూటింగ్స్ మొత్తం ఆపేయటం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై తనదైన శైలిలో బాణాలు ఎక్కు పెట్టాలని పవన్ మాస్టర్ పాన్ వేయడం జరిగిందట. ఈ క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా డైలాగులను ఓ ట్రైలర్ రూపంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో కొన్ని సన్నివేశాలను పవర్ ఫుల్ డైలాగులను ట్రైలర్ గా మార్చి…పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి బూస్ట్ ఇచ్చే విధంగా మూవీ నిర్మాతలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.
నేటి రాజకీయ వ్యవస్థను టార్గెట్ చేసే విధంగా హరీష్ శంకర్ ఈ సినిమాలో డైలాగ్స్ రాయడం జరిగిందట. దీంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కొంత లాభం చేసే విధంగా..”ఉస్తాద్ భగత్ సింగ్”కి సంబంధించి చిన్నపాటి వీడియో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల సడన్ గా పవన్ “ఓజి” సినిమా నుండి చిన్నపాటి పోస్టర్ రిలీజ్ కావటం జరిగింది. ఆ రకంగానే “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి కొన్ని పొలిటికల్ డైలాగులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?