NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS MLC Kavita: కవితకు ఈడీ మరో షాక్

BRS MLC Kavita: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెను ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేదుకు కూడా డిల్లీ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23వ తేదీ వరకూ ఈడీ కవితను విచారించనుంది.

MLC Kavita

ఈ క్రమంలోనే కవితకు మరో షాక్ ఇచ్చేలా ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అలానే కవిత పీఆర్ఓ రాజేష్, ముగ్గురు అసిస్టెంట్ లకు కూడా నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హజరు కావాలని ఈడీ ఆదేశించింది. కవిత నివాసంలో నిన్న సోదాల చేస్తున్న సమయంలో అయిదు సెల్ ఫోన్ లు ఈడీ అధికారులు సీజ్ చేశారు.

Enforcement directorate

ఇవేళ కవితను సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపర్చిన సమయంలో అరెస్టు అక్రమమని ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినా కోర్టు తిరస్కరించింది. ఈడీ తరపు వాదనలకు ఏకీభవించి కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. కాగా, కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని పేర్కొంది. సౌత్ గ్రూప్ పేరుతో కవిత స్కామ్ లో కీలకంగా ఉన్నారని ఈడీ పేర్కొంది.

ఈ కుంభకోణంలో కీలక కుట్రదారు, ప్రధాన లబ్దిదారు కవితేనని, ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కామ్ ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారని చెప్పింది. కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై వ్యవహరించినట్లు పేర్కొంది. పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారాన్ని నడిపించారని అభియోగించింది. కేసు నుండి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలను తొలగించారన్నారు. ఇంకా అనేక విషయాలను రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

BRS MLC Kavita: కోర్టులో కవితకు లభించని ఊరట .. ఈ నెల 23వరకూ ఈడీ కస్టడీకి అనుమతి

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?