NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

Amritha Aiyer: అమృత అయ్యర్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పద్మవ్యూహం అనే మలయాళ చిత్రంతో 2012లో సినీ కెరీర్ ప్రారంభించిన అమృత.. తెనాలి రామన్ తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లింగా, య‌చ్చ‌న్‌, పొక్కిరి రాజా, తేరి, బిగిల్ ఇలా పలు తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించింది. రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కిన‌ రెడ్ మూవీతో అమృత టాలీవుడ్‌కు పరిచయమైంది.ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఆమె నటించింది.

ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోప్ర‌దీప్ కు జోడిగా యాక్ట్‌ చేసింది. రెడ్ మూవీ ఫ్లాప్ అయినా.. ప్రదీప్ సినిమా ద్వారా అమృతకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో అమృత చేసిన మూడో చిత్రం హనుమాన్. మోస్ట్ టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్య‌ర్‌ జంటగా నటించారు. 2024 సంక్రాంతి కానుక జనవరి 12న విడుదలైన హనుమాన్ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబట్టి ఎన్నో రికార్డులను తిరగరాసింది.

ఈ మూవీతో హీరో తేజ నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. అయితే హనుమాన్ సక్సెస్ అమృతకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. ఈ మూవీ ద్వారా పాన్‌ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ ప‌డినా కూడా అమృతకు అదృష్టం క‌లిసి రాలేదు. టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్లు నిల్ అనే చెప్పాలి. హనుమాన్ సక్సెస్ తో ఈ బ్యూటీకి సినిమా ఛాన్సులు వెల్లువెత్తుతాయ‌ని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అమృతను టాలీవుడ్ హీరోలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అమృత సోషల్ మీడియా ద్వారా తన అందాలతో కవ్వించేందుకు ప్రయత్నిస్తోంది. గ్లామర్ షోతో అయినా ఆఫర్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరి హీరోయిన్ గా అమృత అయ్యర్ దశ తిరిగేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.

Related posts

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N