Amritha Aiyer: అమృత అయ్యర్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పద్మవ్యూహం అనే మలయాళ చిత్రంతో 2012లో సినీ కెరీర్ ప్రారంభించిన అమృత.. తెనాలి రామన్ తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లింగా, యచ్చన్, పొక్కిరి రాజా, తేరి, బిగిల్ ఇలా పలు తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించింది. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీతో అమృత టాలీవుడ్‌కు పరిచయమైంది.ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఆమె నటించింది.
ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోప్రదీప్ కు జోడిగా యాక్ట్ చేసింది. రెడ్ మూవీ ఫ్లాప్ అయినా.. ప్రదీప్ సినిమా ద్వారా అమృతకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో అమృత చేసిన మూడో చిత్రం హనుమాన్. మోస్ట్ టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించారు. 2024 సంక్రాంతి కానుక జనవరి 12న విడుదలైన హనుమాన్ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను తిరగరాసింది.
ఈ మూవీతో హీరో తేజ నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అయితే హనుమాన్ సక్సెస్ అమృతకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ పడినా కూడా అమృతకు అదృష్టం కలిసి రాలేదు. టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్లు నిల్ అనే చెప్పాలి. హనుమాన్ సక్సెస్ తో ఈ బ్యూటీకి సినిమా ఛాన్సులు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అమృతను టాలీవుడ్ హీరోలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అమృత సోషల్ మీడియా ద్వారా తన అందాలతో కవ్వించేందుకు ప్రయత్నిస్తోంది. గ్లామర్ షోతో అయినా ఆఫర్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరి హీరోయిన్ గా అమృత అయ్యర్ దశ తిరిగేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.