NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల Vs అవినాష్‌.. గెలుపు టైట్ అయిపోయిందే…!

క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు ఆమె కూడా మాన‌సికంగా రెడీ అవుతున్నారు. తాజాగా క‌డ‌ప‌కు చెందిన కాంగ్రెస్ నాయ కుల‌ను విజ‌య‌వాడ‌కు పిలిపించుకుని మరీ.. చ‌ర్చించారు. వారి నుంచి సేక‌రించిన స‌మాచారంతో పాటు తాను కూడా అనుకున్న‌ది చెప్పార‌ని తెలిసింది. దీంతో క‌డ‌ప నుంచి ష‌ర్మిల పోటీ దాదాపు ఖాయ‌మై పోయింద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది.

వైసీపీ త‌ర‌ఫున ఎంపీ అవినాష్ రెడ్డికి ఇప్ప‌టికే ఎంపీ సీటు ఖ‌రారైంది. అంటే.. మొత్తంగా ప్ర‌ధాన పోటీ వైఎస్ ష‌ర్మిల వ‌ర్సెస్ అవినాష్‌ల మ‌ధ్యే ఉండ‌నుంద‌ని అంటున్నారు. నిజానికి క‌డ‌ప సీటును ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యంపై చంద్ర‌బాబు ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఇదిలావుంటే.. ష‌ర్మిల పోటీలో ఉండే.. ప‌రోక్షంగా ప్ర‌తిప‌క్షాల మ‌ద్ద‌తు ఆమెకే ఉండ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆమెకు ప్ర‌జ‌లు జై కొడ‌తారా? అనేది చూడాలి. ఇదే విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లోన చ‌ర్చ గా మారింది.

దీనిని కొంత‌లోతుగా చూస్తే.. ష‌ర్మిల‌కు క‌నిపిస్తున్న సానుకూల అంశాలు రెండే రెండు. 1) వైఎస్ కుమార్తె గా ఆమెను ప్ర‌జ‌లు ఆద‌రిస్తుండ‌డం. 2) వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యంపై ఆమె కూడా పోరాడుతున్నా ర‌నే వాద‌న‌. ఈ రెండు అంశాలు త‌ప్ప ష‌ర్మిల‌కు క‌లిసి వ‌చ్చే ఇత‌ర విష‌యాలు ఏమీ లేదు. ఇదేస‌మ యంలో ష‌ర్మిల‌కు మైన‌స్‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆమె ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుమ‌ని 10 రోజులు కూడా ఉన్న‌దిలేదు. పైగా.. ఆమె ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ.. ప్రాతినిద్యం కూడా వ‌హించ‌లేదు.

ఇక్క‌డివారికి నాయ‌కురాలిగా కంటే కూడా వైఎస్ త‌న‌య `ష‌మ్మీ`గానే పరిచయం.కాబ‌ట్టి.. ఆమె ను ఎలా రిసీవ్ చేసుకుంటార‌నేది ప్ర‌శ్న‌. ఇక‌, అవినాష్ వ్య‌వ‌హారం చూస్తే.. ఒక్క వివేకా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు మిన‌హా.. వాస్త‌వానికి ఆయ‌న‌పై మైన‌స్‌లులేవు. పైగా.. ఆయ‌న ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఎవ‌రు ఏ స‌మ‌స్య ఉంద‌న్నా.. నేనున్నాన‌ని ముందుకు వ‌స్తున్నారు. (ఇది అతిశ‌యోక్తి లేదా.. క‌ర‌డు క‌ట్టిన వైసీపీ నేత‌లు చెబుతున్న మాట కాదు. ప్ర‌తిప‌క్షాల్లోనూ అవినాష్ గురించి మాట్లాడితే నియోజ‌క‌వ‌ర్గానికి ఏమీ చేయ‌లేదు అనే మాటే వినిపించ‌దు) దీంతో ఎవ‌రు గెలుస్తార‌నేది ఆసక్తిగా మారింది. చూడాలి.. క్లారిటీ వ‌చ్చాక మ‌రింత స్ప‌ష్ట‌త రానుంది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!