NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 26  2024 Episode 428: ఆదర్శ్ మీద చేయి చేసుకున్న భవాని దేవి..మురారి మీద కృష్ణ ప్రేమ.. మీరా నీ చూడాలన్న భవాని దేవి..

Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights

Krishna Mukunda Murari March 26  2024 Episode 428:  మురారి, పోలీస్ స్టేషన్లో బాగా దెబ్బలు తిని ఇంటికి వస్తాడు. శ్రీనివాస్ మురారి ఇంకొక రోజు కనుక ముకుంద వెళ్ళకుండా ఉన్నట్టయితే లాక్ అప్డేట్ అయి ఉండేవాడు అనవసరంగా ముకుంద వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ముకుంద వస్తుంది ఏంటి నాన్న నువ్వు చేసిన పని అని అడుగుతుంది నువ్వేం చేసావు ఇప్పుడు వెళ్లి మురారిని విడిపించావా విడిపించి తప్పు చేశావు ముకుందా అని అంటాడు తప్పు చేసింది నేను కాదు నాన్న నువ్వు నీకసలు మనసుందా మురారిని అంత దారుణంగా కొట్టిస్తావా అని అడుగుతుంది. ఒక రాత్రి నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నట్టయితే మురారి కన్ను మూసేవాడు అని శ్రీనివాస్ అంటాడు. ఆపు నానా ఇంకొక మాట మాట్లాడినా నేను కన్న తండ్రి అని కూడా చూడను అని అంటుంది ముకుందా నేను కన్న తండ్రి నా ఆరాటం నీ గురించి అని అంటాడు. నా కూతురు జీవితం నాశనం అవుతుంటే నేనెలా చూస్తూ ఉంటానని శ్రీనివాస్ అంటాడు నేను చెప్పానా నాన్న నా జీవితం నాశనం అవ్వడానికి కారణం మురారి అని నేను ఎప్పుడైనా నీతో చెప్పానని అంటుంది. నువ్వు చెప్పక్కర్లేదు నాకు మురారి విషయంలో క్లియర్ గా తెలిసిపోతుంది అని శ్రీనివాస్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights
Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights

నేనే మురారిని వదలకుండా ఉన్నాను అది అర్థం చేసుకోకుండా నా మురారి ఈ ప్రాణం నువ్వు తీస్తున్నావు అని శ్రీనివాస్తో ముకుందా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఇక నుంచి వెళ్ళిపో నాన్న అసలు మురారి దగ్గరికి నేను వెళ్ళిపోతాను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది ఏంటమ్మా నువ్వు రూపం మార్చుకున్న తర్వాత కూడా వాళ్ళు నిన్ను ఎలా చేరదీస్తారు అని అనుకుంటున్నావు మురారి నువ్వుగా ఉన్నప్పుడే ప్రేమించలేదు ఇప్పుడు ఎలా ప్రేమిస్తాడు అని అంటాడు శ్రీనివాస్. రూపం మార్చుకున్నాను కాబట్టి నన్ను మురారి ప్రేమిస్తాడు రూపం మార్చుకొని వాళ్లకు దగ్గర అవుతాను. నాలో ఉన్న ప్రేమని మురారిని తట్టి లేపుతాను అని అంటుంది ముకుందా, శ్రీనివాస్ నీ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను అని అంటాడు శ్రీనివాస్ ఎలాగైనా సరే నువ్వు ఇక నుంచి వెళ్లాలి నాన్న దీని వెనకాల నా పదేమీ లేదు నీ క్షేమం మాత్రమే ఉంది ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను చంపేయాలని అంత కోపంతో ఉన్నారు ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మురారి ఇంటికి తిరిగి వచ్చాడు కాబట్టి కొంతకాలం ఏమీ అనకుండా ఉంటారు అది కూతురు చనిపోయింది అన్న బాధలో ఉన్నావని వదిలేస్తారు కొంతకాలం తర్వాత అయినా వాళ్ళు నీ మీద పగ తీర్చుకోవడానికి ఇక్కడికి రావచ్చు అందుకే ఇల్లు ని అమ్మేసేసి అందులో వచ్చిన కొంత మొత్తాన్ని నాకు ఇచ్చేసి మిగిలింది నువ్వు తీసుకొని ఇకనుంచి దూరంగా వెళ్లిపో అని ముకుందా శ్రీనివాసుని ఇంట్లో నుంచి పంపించేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights
Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights

ఇక మరోవైపు కృష్ణ మురారి నిద్ర పోతుంటే తనని అలానే చూస్తూ ఉండిపోతుంది తెల్లవారి మురారి నిద్రలేచేసరికి రాత్రంతా నిద్ర పోలేదా కృష్ణ అని అడుగుతాడు మీకు ఏమవుతుందోనని భయంతో వణికిపోయానే సార్ మీరు ఇలా వస్తారని కలలో కూడా అనుకోలేదు మిమ్మల్ని ఇలా చూడడం నాకు కలగానే ఉంది ఎక్కడ నేను నిద్రపోతే అది కలయిపోతుందో అని రాత్రంతా మిమ్మల్ని చూస్తూ కూర్చున్నాను అని అంటుంది. ఆ మాటలకు మురారి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గరనుంచి కష్టపడుతూనే ఉన్నావని మురారి కృష్ణతో అంటాడు. ఇంత ప్రేమిస్తున్న నీకు నేను బాధలు మాత్రమే మిగిల్చాను అని అంటాడు మీరు నా కోసం బాధలు పడలేదా ముకుంద మీద ఉన్న ప్రేమని నా చెయ్యి వదిలేసి తన చెయ్యి పట్టుకునే వాళ్ళు కాదా కానీ అలా చేయలేదు ఎంతసేపు నా మీద ప్రేమే చూపించారు ఎంత ఎక్కువ బాధలు పడితే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు అని కృష్ణ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు మురారి కూడా నవ్వుతూ ఉంటాడు ఇక ఇద్దరు అలా మాట్లాడుకోవడం చూసి రేవతి సంతోషపడుతుంది అక్కడికి వచ్చి కృష్ణుని చూసి ఈ రెండు రోజుల నుంచి అసలు నీ మొహం లో నవ్వే లేదు ఇవాళ నవ్వుతున్నవ్ కృష్ణ నువ్వు అని అంటుంది రేవతి. మీరు అలా అనకండి అత్తయ్య ఇప్పుడు మళ్ళీ ఏసీపీ సార్ ఫీల్ అవుతారు తన వల్లే మనం బాధపడుతున్నామని అని అంటుంది కృష్ణ. ఇక ఇద్దరికీ కాపీ తీసుకొని రేవతి ఇస్తుంది. కోడలు ఎక్కువ పొగిడేస్తే నెత్తికెక్కి కూర్చుంటారు అత్తయ్య అని అంటుంది కృష్ణ నా కోడలు అలాంటిది కాదులే అని అంటుంది రేవతి. ఇద్దరు ఫ్రెష్ కిందకి రండి అని చెప్పి రేవతి వెళ్లిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights
Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights

ఇక మరోవైపు ఆదర్శ్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు నందిని వచ్చే ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు ఒకప్పుడు ముకుంద తన మనసులో లేదని ఇప్పుడు తన ఇంట్లో వాళ్ళ దగ్గర తనకి చోటు లేదని అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటాడు ఇంకా మధు వచ్చి నువ్వు వెళ్లడానికి వీల్లేదు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి తప్పు చేస్తున్నావు అని అంటాడు ఇక మధు వచ్చి సీరియస్ అవుతూ ఉంటే ఆదర్శ్ కి కోపం వస్తుంది ఆ కోపం లో నువ్వు అందరూ మందు పోస్తుంటే అక్కడికి వచ్చి అడుక్కొని దగ్గర లాగా మందు తీసుకునే వాడివి నువ్వు కూడా ఇవాళ నన్ను వెళ్ళకుండా ఆపుతున్నావా అని మధు మీద సీరియస్ అవుతాడు ఆదర్శ్ వెంటనే అక్కడికి వచ్చిన మధులత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఆదర్శ్ నా కొడుకుని లాగా సంపాదన లేకపోయి ఉండొచ్చు కానీ సంస్కారం లేని వాడు అయితే మాత్రం కాదు వాడికి ఒక లక్ష్యం ఉంది దాని కోసం వాడు ప్రయత్నిస్తున్నాడు అందులో ఎప్పటికైనా వాడు సక్సెస్ అవుతాడు నమ్మకం మాకుంది నువ్వు అన్నయ్యవని అభిమానంతో ఇక్కడ ఉండమంటున్నాడు నువ్వు ఇక నుంచి ఉంటే వాడికి ఏంటి వెళ్ళిపోతే వాడికేంటి అంతేకానీ నువ్వు మందు గ్లాస్ కోసమో నువ్వు ఇచ్చే మందు కోసమా నా కొడుకు నిన్ను ఇక్కడ ఉండమని చెప్పట్లేదు అని అంటుంది మధులత. నిన్ను నీ కొడుకును చూసి నేను ఇక్కడ ఉండాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ దేవి ఆదర్శ్ ని కోపంతో లాగిపెట్టి ఒకటి చెంప మీద కొడుతుంది. భవాని దేవిని చూసి ఆదర్శ షాక్ అవుతాడు ఇక ఆదర్శం అసలు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూసుకున్నావా? ఏంటి చిన్న పెద్ద తేడా లేకుండా వాగుతున్నావ్ చంపేస్తాను ఏమన్నా ఎక్కువ మాట్లాడితే లోపలికి వెళ్ళు, తల స్నానం చేసి రా అని తిడుతుంది. రాత్రంతా ఏడుస్తూ మందు కొడుతూ కూర్చున్నట్టున్నావు నీ అవతారం చూడలేకపోతున్నాను. నువ్వు వెళ్లి ముందు స్నానం చేసిరాపో అని అంటే వెంటనే ఆదర్శం అమ్మ అని దగ్గరికి తీసుకొని ఏడుస్తాడు ఇక ఆదర్శం చూసి భవాని దేవి కూడా నాకు ముందు కొంచెం ఎమోషనల్ అవుతుంది. అంతలో మురారి ఎక్కడ అని అడుగుతుంది. మురారి గురించి అడగ్గానే ఆదర్శ పక్కకు జరుగుతాడు ఇక రేవతి ఎట్లా ప్రయాణం జరిగింది అక్క, మీరు బాగున్నారు కదా అని అంటే నా గురించి పక్కన పెట్టి రేవతి ముందు మురారి ఎలా ఉన్నాడో చెప్పు అని అంటే మురారిని పోలీసులు కొట్టారని తను నడవలేకుండా ఉన్నాడని నేను వెళ్లి మురారిని తీసుకొస్తానని మధు పైకి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights
Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights

ఇక మరోవైపు ముకుందా ఫోటో చూసి భవానీ దేవి ఉన్నన్నాళ్ళు ఇంట్లో ఎవరికి కలవకుండా ఇంటి మనిషిలా లేదు ఇప్పుడు అసలే లేకుండా పోయింది అని అంటుంది. ముకుంద ఫోటో చూస్తూ ఆదర్శ పాప ముకుందామా అన్యాయంగా అని అంటాడు. ఆదర్శ అన్యాయంగా జరిగిందని ఏం జరిగిందో నాకు నువ్వు చెప్పక్కర్లేదు నాకు అన్నీ తెలుసు మనం చూసేవి విన్నవి నిజాలని అనుకుంటే పొరపాటే ఒక్కొక్కసారి మనమంతాకు మించి లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది అని అంటుంది ఆధర్ కి కోపం వస్తుంది. ఇక మురారి నీ మధు కృష్ణ కలిసి పట్టుకుని కిందకు తీసుకొస్తారు మురారిని చూసి భవాని దేవి ఎమోషనల్ అవుతుంది. ఆదర్శ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మురారిని ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది భవాని దేవి. అయినా నేను నీలా చూస్తానని అనుకోలేదు పోలీసులు కొట్టిన దెబ్బలకి మురారి బాధపడుతూ ఉంటే చేయని తప్పులకి నిందలు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అత్తయ్య అని కృష్ణ కూడా బాధపడుతుంది.ఇక భవానీ దేవితో ముకుందా అలా ఎలా చేసిందో నాకు తెలియదు అమ్మ నేను ఏ తప్పు చేయలేదు అని భవాని దేవితో చెప్తూ ఉంటాడు మురారి వెంటనే భవాని దేవి నువ్వేంటో నాకు తెలుసు నాన్న అని మురారి కి సపోర్ట్ చేస్తుంది నా బిడ్డ ఇలాంటి వాడు నాకు తెలుసు దీని వెనక ఎవరున్నారో తెలుసుకొని తీరుతాను అని భవాని దేవి అంటుంది ఇక కృష్ణా సమయానికి మీరా వచ్చి కాపాడింది లేదంటే వాళ్ళు కాదత్తయ్య అని చెబుతుంది ఇంతకీ ఎవరు మీరు అని అడుగుతుంది భవాని దేవి. ఇక మీరాని కలవాలని భవాని దేవి అనుకుంటుంది. తన ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉందని కృష్ణుని అడుగుతుంది భవాని దేవి అడ్రస్ ఉందని చెప్తుంది కృష్ణ అయితే నేనే వెళ్లి కలుస్తాను అని అంటుంది భవాని దేవి. రేవతి మీరు ఎందుకు అక్క వెళ్లడం ఫోన్ చేస్తే అమ్మాయి వస్తుంది అని అంటుంది తప్పు రేవతి మనల్ని కాపాడిన వాళ్ళని, మనమే వెళ్లి కలవాలి మన మురారిని కాపాడిన దేవత మీరా అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights
Krishna Mukunda Murari Today Episode March 26  2024 Episode 428 highlights

రేపటి ఎపిసోడ్ లో భవానీ దేవి వెళ్లి మీరు అని ఇంటికి తీసుకువస్తుంది. లోపలికి వస్తూనే మీరా ఒకసారి ఒక రూపంలో వచ్చి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మరో రూపంలో ఇంట్లోకి అడుగు పెడుతున్న ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు గేమ్స్ స్టార్ట్ కృష్ణ అని కృష్ణ వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella