NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెండో రోజు బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. వివిధ నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్ కు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. బస్సు యాత్ర లో భాగంగా గురువారం ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎర్లగుంట్ల పంచాయతీ పరిధిలో ప్రజలు, మేధావులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. ప్రతి అక్కా చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్ నొక్కి నేరుగా అకౌంట్ లలో నగదు జమ చేస్తున్నానని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా లంచాలు, వివక్ష లేదన్నారు. అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్ల లోనే 93 శాతం మంది లబ్దిపొందారని వివరించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్దిని స్వయంగా ఆయన గణాంకాలతో వివరించారు.

నా కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా చేశారని, నా కన్నా వయసు, అనుభవం ఉన్న వ్యక్తులు సీఎంలుగా చేశారు, నా కంటే ముందు 75 ఏళ్ల వయసున్న ఓ ముసలాయన కూడా పరిపాలన చేశాడు. వయసులో నేను చాలా చిన్నోడిని. ఈ చిన్నోడిగా అడుగుతున్నా..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా .. ఆలోచన చేయండని కోరారు.

గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లు రూపురేఖలు నాడు నేడు తో మారిపోయాయన్నారు. మీ బిడ్డ పాలనలో మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించాలని కోరారు. ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు..మన భవిష్యత్తు కోసం ఓటేయాలని, జరిగిన మంచి చూసి ఓటు వేయండని జగన్ కోరారు.

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?