NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights

Mamagaru March 28 2024 Episode 172: గంగ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. గంగ ఎంత సేపు చూస్తావ్ నువ్వు ఎంతసేపు చూసినా నాకు జాబ్ రాదు అని గంగాధర్ అంటాడు. వస్తుంది చూడండి అని గంగ అంటూ ఉండగా ఒక అతను ఫోన్ చేస్తాడు. గంగా ఫోన్ ఎత్తి హలో ఎవరు కావాలండి అని అడుగుతుంది. వాట్సాప్ లో వర్క్ చేస్తామన్నారు కదా అండి మా బీరువా కరాబ్ అయింది వచ్చి చేయండి అని అతను అంటాడు. రాంగ్ నెంబర్ అండి మేము బీరువాలో బాగు చేయము అని గంగ ఫోన్ కట్ చేస్తుంది. గంగ గంగాధర్ బీరువాలు బాగు చేయబడును అని టైటిల్ బాగుంది అని నవ్వుతాడు గంగాధర్.గంగ నువ్వు ఓడిపోయావు కాబట్టి ఈ గంగాధర్ కి ముద్దులు పెట్టాల్సిందే అని గంగాధర్ అంటాడు.పెట్టను అంటూ గంగ పరిగెత్తుతుంది. పెట్టాలి గంగ అంటూ గంగాధర్ పరిగెత్తి గంగ చేయి పట్టుకొని దగ్గరికి లాగి ముద్దు పెట్టు అని అంటాడు. పెట్టను అంటూ గంగ గంగాధర్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. పెట్టనంటే కుదరదు గంగ పందెంలో ఓడిపోయవ్ ముద్దు పెట్టాల్సిందే అని గంగాధర్ అంటాడు. మీరు కళ్ళు మూసుకోండి ముద్దు పెడతాను అంటూ గంగ గంగాధర్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. గంగాధర్ సంతోషపడతాడు. గంగ సిగ్గుపడి తలవంచుకుంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights
Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights

చంగయ్య తాగిన మత్తులో గురక పెడుతూ ఉంటాడు. దానికి తోడు పాండురంగ కూడా గురక పెడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి గురుకుల తట్టుకోలేక ఇంట్లో వాళ్ళందరూ చెవులు మూసుకుంటారు. అమ్మ ఇక్కడ మనం ఉండొద్దు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి పోదాం అని శ్రీలక్ష్మి కూతురు అంటుంది. ఏంటండీ మనకి డబల్ ధమాకా అని వసంత అంటుంది. పాండురంగ కొడుకు చ0గయ్య నోట్లో గుడ్డ పెడతాడు. కాస్తంత గురక తగ్గుతుంది. కానీ పాండురంగ గురక తట్టుకోలేకపోతూ ఉంటారు శ్రీలక్ష్మి వెంటనే పాండురంగ మొహం మీద మెత్త వేస్తుంది. పాండురంగ పక్కకు తిరిగి కాల్ లేపి బాంబు వదులుతాడు. ఆ వాసన పీల్చుకోలేక ఇంట్లో వాళ్ళందరూ ముక్కులు మూసుకొని ఏంట్రా బాబు మాకు ఈ గోల అని అనుకుంటారు. ఇంతలో తెల్లవారుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights
Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights

గంగ ఫోన్ పట్టుకుని ఇంకా ఫోన్  రాలేదంటూ చూస్తూ ఉంటుంది. గంగాధర్ కాఫీ తీసుకువచ్చి ఏం ఆలోచిస్తున్నావు గంగ నాకు ఉద్యోగం రాదు కానీ ఈ కాఫీ తాగు అని అంటాడు. ఎందుకండీ అలా అంటారు వస్తుంది చూడండి ఆశ బ్రతికిస్తుంది అని గంగ ఉంటుంది. గంగా నా గురించి తెలిసిన ఎవరూ నాకు జాబ్ ఇవ్వరు అని గంగాధర్ అంటూ ఉంటాడు. గంగ కాఫీ తాగుతూ కాఫీ చాలా బాగుందండి అని అంటుంది. ఇంతలో మెసేజ్ రాగానే ఏవండీ మీకు ఉద్యోగం వచ్చింది అని గంగ అంటుంది. ఎక్కడ గంగ అని గంగాధర్ అంటాడు. గాంధీనగర్ కాలనీలో వర్క్ ఉందంట రమ్మన్నారండి అని గంగ అంటుంది. గంగ నువ్వు గెలిచావు గంగ నాకు జాబ్ వచినందుకు నీ కళ్ళల్లో సంతోషం  చూస్తున్నాను మరి కమిషన్ అడగవా అని గంగాధర్ అంటాడు. ఇద్దరు అలా నవ్వుకుంటారు.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights
Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights

అమ్మ ఆకలి బాగా వేస్తుంది తాత ఇంకా రాలేదు మాకు ఇంట్లో టిఫిన్ చేసి పెట్టవా అని వసంత పాప అడుగుతుంది. ఏవండీ పిల్లలకు ఆకలి వేస్తుంది అంట మీరు చెప్పండి అని వసంత అంటుంది.ఏం చెప్పను వసంత విన్నావుగా నువ్వే చెప్పుఅని సుధాకర్ అంటాడు. పిల్లలు మీ తాతయ్య టిఫిన్ తీసుకొస్తానని బయటికి వెళ్లాడు వెళ్లి చూడండి అని వసంత అంటుంది. అమ్మ తాతయ్య టిఫిన్ తెస్తాను అంటే మీరు ఎలా నమ్మారు అని పిల్లలు అంటారు. ముందు మీరు తాత ఏస్తున్నాడో లేదో బయటికి వెళ్లి చూడండి అనడంతో పిల్లలు బయటికి వెళ్లి చూస్తారు. చ0గయ్య టవలనిండా ఏదో మూట కట్టుకొని వస్తాడు. తాతయ్య ఆకలేస్తుంది బాగా రా త్వరగా అని పిల్లలు అంటారు. పిల్లలు మీ కోసమే ఎప్పుడు మీరు తినని టిఫిన్ తెచ్చాను పదండి అని లోపలికి వస్తాడు చంగయ్య.

Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights
Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights

మామగారు టిఫిన్ తెచ్చారా పిల్లలకి ఆకలేస్తుంది అంట త్వరగా పెట్టండి అని శ్రీలక్ష్మి అంటుంది. తెచ్చాను కదా అమ్మ మీరు ఇంతవరకు ఎన్నడూ తినని మంచి పోషక ఆహారం తెచ్చాను అని చ0గయ్య అంటాడు. మామగారు  నోరూరిస్తున్నారు కానీ చూపించడం లేదు అని శ్రీలక్ష్మి అంటుంది. మీరందరూ కళ్ళు మూసుకోండి చూపెడతాను అని చ0గయ్య అంటాడు. అందరూ కళ్ళు మూసుకుంటారు. పిల్లలు చూద్దామని కళ్ళు తెరవగానే పిల్లలు చీటింగ్ చేస్తున్నారు కళ్ళు మూసుకోండి అని చెంగయ్య అంటాడు.

Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights
Mamagaru Today Episode March 28 2024 Episode 172 highlights

అందరూ కళ్ళు మూసుకోగానే మూట విప్పి ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి అని అంటాడు చంగయ్య. అందరూ కళ్ళు తెరిచి చూసి షాక్ అయి అయిపోతారు. నాన్న టిఫిన్ తెమ్మంటే కొబ్బరి చిప్పలు తెచ్చావ్ ఏంటి అని పాండురంగ అంటాడు. ఏమిటండీ ఇది అనే దేవమ్మా అంటుంది. కొబ్బరి లో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో చెప్తాను వినండి అని చ0గయ్య మొదలు పెడతాడు. ఇక ఆపండి నాన్న మీ కొబ్బరి చిప్పల పురాణం అని పాండురంగ అంటాడు

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri